Chicken Fry: ఒక్క చుక్క నూనె వేయకుండానే.. టేస్టీ చికెన్ ఫ్రై..

| Edited By: Ravi Kiran

Sep 25, 2024 | 9:30 PM

చికెన్ అంటే చాలా మందికి ప్రాణం. నాన్ వెజ్‌లో ఎక్కువగా తినేది చికెనే. చికెన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా లభిస్తుంది. చికెన్‌తో చేసే రెసిపీలు చాలానే ఉన్నాయి. చికెన్‌తో ఫ్రైలు, పచ్చళ్లు, రెసిపీలు, స్నాక్స్ ఇలా ఒక్కటేంటి.. చాలానే తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా చాలా మంది చికెన్ కర్రీ కంటే ఫ్రై అంటే ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు మారిన కాలంలో అనేక అనారోగ్య సమస్యలు..

Chicken Fry: ఒక్క చుక్క నూనె వేయకుండానే.. టేస్టీ చికెన్ ఫ్రై..
Chinek Fry
Follow us on

చికెన్ అంటే చాలా మందికి ప్రాణం. నాన్ వెజ్‌లో ఎక్కువగా తినేది చికెనే. చికెన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా లభిస్తుంది. చికెన్‌తో చేసే రెసిపీలు చాలానే ఉన్నాయి. చికెన్‌తో ఫ్రైలు, పచ్చళ్లు, రెసిపీలు, స్నాక్స్ ఇలా ఒక్కటేంటి.. చాలానే తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా చాలా మంది చికెన్ కర్రీ కంటే ఫ్రై అంటే ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు మారిన కాలంలో అనేక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎటాక్ చేస్తున్నాయి. ఆయిల్ వంటకాలు ఎక్కుగా తిన్నా ప్రమాదమే. కాబట్టి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండానే మనం ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ఫ్రై‌కి కావాల్సిన పదార్థాలు:

చికెన్, కొబ్బరి పాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, నిమ్మరసం.

చికెన్ ఫ్రై‌ తయారీ విధానం:

ముందుగా మనం కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో మిరియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు ఒక దాని తర్వాత మరొకటి వేసుకుని వేయించి ఓ మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఆ మిక్సీలోకి అల్లం, వెల్లుల్లి కూడా వేసి చల్లారాక అన్నీ వేసి పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి అందులో పసుపు, ఉప్పు, కారం, మిక్సీ పట్టిన పేస్టు కూడా వేసి ఓ గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇప్పుడు మందంగా ఉండే ఓ పాత్ర తీసుకుని కొబ్బరి పాలు వేసి స్టవ్ మీద పెట్టాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడు.. మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఓ 20 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు చల్లి.. ఓ రెండు నిమిషాలు ఉడికించాలి. చివరిలో నిమ్మరసం పిండాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై సిద్ధం.