Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blisters on Feet: కొత్త చెప్పులు కరుస్తున్నాయా? ఇలా చేస్తే మీ కాళ్లు సేఫ్‌..

ముచ్చటపడి కొనుక్కున్న కొత్త చెప్పులు పట్టుమని ఒకరోజు వేసుకున్నారో లేదో కాళ్లపై బొబ్బలు వచ్చి, తెగ ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో ఏం చేయాలో తెలీక చాలా మంది ఇబ్బందిగానే వాటిని వేసుకుంటుంటారు. అయితే కొత్త చెప్పులు ఇలా కరవకుండా ఉండాలంటే నిపుణులు ఇక్కడ కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Blisters on Feet: కొత్త చెప్పులు కరుస్తున్నాయా? ఇలా చేస్తే మీ కాళ్లు సేఫ్‌..
Blisters On Feet
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 03, 2025 | 5:55 PM

పెళ్లిళ్లు, ఫంక్షన్లు.. ఇలా సందర్భం ఏదైనా అమ్మాయిలు రకరకాల ఫ్యాషన్లకు తగ్గట్లు షాపింగ్‌ చేసేస్తుంటారు. ఎలా దుస్తులు ధరించాలి, ఎక్కడికి వెళ్లాలి అనే విషయాలను ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని తమ అభిరుచికి తగ్గట్లు రెడీ అయిపోతుంటారు. అయితే నచ్చిన డ్రెస్‌పైకి సరిగ్గా సరిపోయేలా చెప్పులు కూడా కొంటుంటారు. వాటిని ధరించి, అందంగా అలంకరించుకుని ఫంక్షన్లకు వెళ్తుంటారు. కానీ కాసేపటికే వేసుకున్న కొత్త చెప్పులు కాళ్లకు చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ అనుభవం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అవును.. కొత్త చెప్పులు వేసుకుంటే కనీసం రెండు మూడు రోజుల వరకు అవి కరుస్తుంటాయి. దీంతో పాదాలపై గాయాలవుతుంటాయి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

షూస్ ధరించడానికి ముందు రోజు రాత్రి మాయిశ్చరైజర్, పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరి నూనెను కొత్త బూట్లు లేదా చెప్పులకు రాయాలి. రాత్రంతా ఇలాగే ఉంచి.. ఉదయం ఒక గుడ్డతో మాయిశ్చరైజర్ తొలగించి బూట్లు ధరించాలి. అలాగే బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొత్త చెప్పులు అస్సలు కరవకుండా హాయిగా ఉంటుంది. అలాగే షూలో ఏదైనా భాగం మందంగా ఉంటే, అది కాలి చర్మంపై రాపిడి కలిగిస్తుంది. దీని కారణంగా పొక్కులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే పెట్రోలియం జెల్లీని ఆ భాగాలపై బాగా రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇది బూట్లను మృదువుగా ఉంచుతుంది. తద్వారా బొబ్బలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

కాల్లపై పొక్కులే వస్తే.. వాటిపై యాంటిసెప్టిక్ క్రీమ్, బ్యాండ్ ఎయిడ్ రాయాలి. అవకాశం దొరికితే, కరుస్తున్న షూలను తీసివేసి, పాదాలకు గాలి తగిలేలా కాసేపు ఉంచితే గాయం వేగంగా నయం అవుతుంది. తేనె, కలబందను రోజుకు కనీసం 3 సార్లు పొక్కులకు రాసినా.. బొబ్బలు పొడిబారి చాలా త్వరగా గాయాన్ని మాన్పుతుంది. బూట్లు కొనడానికి ముందు, సౌకర్యాన్ని గుర్తుంచుకోవాలి. స్టైల్‌ గురించి మాత్రమే ఆలోచించడం మానుకుని సౌకర్యవంతంగా ఉండి, నాణ్యత కలిగిన వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. తద్వారా కాళ్లకు సౌకర్యవంతంగా మీకు మంచి లుక్‌ కూడా వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..
కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..
సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ
సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ
సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్‌ పొందండి!
సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్‌ పొందండి!
చరణ్ సరసన క్రేజీ బ్యూటీ.. సుకుమార్ ప్లానింగ్ వేరెలెవల్..
చరణ్ సరసన క్రేజీ బ్యూటీ.. సుకుమార్ ప్లానింగ్ వేరెలెవల్..
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రక్తాలు(చెమట) చింధిస్తున్న టీం ఇండియా!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రక్తాలు(చెమట) చింధిస్తున్న టీం ఇండియా!
అర్ధరాత్రి నడిరోడ్డుపై లగ్జరీ కారు బీభత్సం.. ఏం జరిగిందంటే?
అర్ధరాత్రి నడిరోడ్డుపై లగ్జరీ కారు బీభత్సం.. ఏం జరిగిందంటే?
'కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్‌ తో చిక్కుల్లో హీరోయిన్
'కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్‌ తో చిక్కుల్లో హీరోయిన్
BSNL 90 రోజుల పాటు చౌకైన ప్లాన్‌.. ప్రైవేట్‌ కంపెనీలకు ధీటుగా..
BSNL 90 రోజుల పాటు చౌకైన ప్లాన్‌.. ప్రైవేట్‌ కంపెనీలకు ధీటుగా..
మద్యం తాగితేనే ఫ్యాటీ లివర్ వస్తుందనుకుంటే పొరబడినట్లే..
మద్యం తాగితేనే ఫ్యాటీ లివర్ వస్తుందనుకుంటే పొరబడినట్లే..
ఇక గరళ కాలుష్యం నుంచి యమునాకు విముక్తి..!
ఇక గరళ కాలుష్యం నుంచి యమునాకు విముక్తి..!