జీడిపప్పుతో ప్రయోజనాలు

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన వంటల్లో రుచికి వాడే పదార్థాల్లోనే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీడిపప్పు కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీన్ని కాజూ అని కూడా అంటారు.జీడిపప్పు అనగానే కొవ్వు పెరుగుతుందనే అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. చెడు కొలెస్ట్రాల్‌ను బయటికి పంపి మంచి కొలెస్ట్రాల్‌ను అందిస్తుంది.  జీడిపప్పులో కాపర్‌, ఫాస్పరస్‌, జింక్‌, ఐరన్‌, మాంగనీస్‌, సెలీనియంతో పాటు అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్స్‌, యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. […]

జీడిపప్పుతో ప్రయోజనాలు
Follow us

|

Updated on: Aug 23, 2019 | 3:34 PM

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన వంటల్లో రుచికి వాడే పదార్థాల్లోనే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీడిపప్పు కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీన్ని కాజూ అని కూడా అంటారు.జీడిపప్పు అనగానే కొవ్వు పెరుగుతుందనే అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. చెడు కొలెస్ట్రాల్‌ను బయటికి పంపి మంచి కొలెస్ట్రాల్‌ను అందిస్తుంది.  జీడిపప్పులో కాపర్‌, ఫాస్పరస్‌, జింక్‌, ఐరన్‌, మాంగనీస్‌, సెలీనియంతో పాటు అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్స్‌, యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. రోజూ మితంగా జీడిపప్పు తింటే పోషక లోపంతో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చు.

* జీడిపప్పు అధిక రక్తపోటును తగ్గించి గుండె జబ్బులను నివారిస్తుంది. * రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎముకలను పటిష్టం చేస్తుంది. * జీడిపప్పులో ఉండే లుటిస్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది. *  ఫైబర్‌ కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది * కాపర్‌ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. *  మెగ్నీషియం నరాల బలహీనత రాకుండా చేస్తుంది. * దంతాలు ధృడంగా మారుతాయి. * నాడీ మండల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. * మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టేలా చేస్తుంది. * శరీరానికి హాని కలిగించే కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. తద్వారా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతుంది. * జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం బాధించవు. * ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా ఉంటారు.

శరీరానికి కావలసిన అన్ని పోషకాలను జీడిపప్పు నుండి పొందవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒలిక్‌ ఆసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని 25శాతం వరకు తగ్గించుకోవచ్చు. రక్తహీనత లేకుండా చేస్తుంది. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే జీడిపప్పునుమితంగా తీసుకుంటే అనేక రోగాల నుంచి కాపాడుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?