బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు

ఇంగ్లిష్‌లో ‘ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్’గా పిలిచే బొప్పాయిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, విటమిన్ కె అధిక మోతాదులో ఉంటాయి. పీచు పదార్థం, మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయి. బొప్పాయి వల్ల లభించే ప్రయోజనాలేంటో చూద్దాం.. బరువు తగ్గడం… బరువు తగ్గాలనుకుంటున్న వారికి బొప్పాయి మంచి ఆహారం. ఇందులో పీచుపదార్థాలు అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. బొప్పాయి ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన భావన […]

బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:27 PM

ఇంగ్లిష్‌లో ‘ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్’గా పిలిచే బొప్పాయిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, విటమిన్ కె అధిక మోతాదులో ఉంటాయి. పీచు పదార్థం, మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయి. బొప్పాయి వల్ల లభించే ప్రయోజనాలేంటో చూద్దాం..

  • బరువు తగ్గడం… బరువు తగ్గాలనుకుంటున్న వారికి బొప్పాయి మంచి ఆహారం. ఇందులో పీచుపదార్థాలు అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. బొప్పాయి ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గుతారు.
  • కేన్సర్‌తో పోరాడుతుంది… పెద్ద పేగు, ప్రొస్టేట్ కేన్సర్లను తగ్గించే గుణం బొప్పాయికి ఉంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్స్ ఉండటమే దీనికి కారణం.
  • చర్మానికి రక్షణ… చర్మ సంరక్షణకు బొప్పాయి ఎంతో ఉత్తమం. దీన్ని చర్మానికి రాసుకుంటే.. పపైన్ అనే ఎంజైమ్ వల్ల శరీరం కాంతివంతం అవుతుంది. మొటిమలు తగ్గుముఖం పడతాయి. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
  • రోగనిరోధక శక్తి పెరుగుతుంది… రోగనిరోధక వ్యవస్థ సరిగా పని చేయడం కోసం విటమిన్-ఎ, విటమిన్-సి అవసరం. బొప్పాయిలో ఉండే ఈ విటమిన్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. జలుబు, ఫ్లూ రాకుండా బొప్పాయి అడ్డుకుంటుంది.
  • కంటి చూపు తగ్గకుండా… రోజూ బొప్పాయి తినడం వల్ల కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. ఇందులో ల్యూటిన్, జియాక్సాన్‌థిన్, క్రిప్టాక్సాన్‌థిన్ అనే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల త్వరగా వయసు మీద బడటంతోపాటు జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది.
  • జీర్ణక్రియ మెరుగవుతుంది… జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి తినడం ప్రయోజనకరం. వీటిలో అల్సర్లను తగ్గించే గుణాలుంటాయి. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్దకాన్ని బొప్పాయి నివారిస్తుంది.