బాదంతో నవ యవ్వనం

బాదంపప్పులో మంచి పోషకాలు ఉన్నాయి. కొవ్వులు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్థిగా వున్నాయి. బాదం నూనెను చర్మసౌందర్యంతో పాటు శిరోజాలకూ ఉపయోగిస్తారు. అంతేకాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. బాదంలో ఉండే విటమిన్ ఇ.. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణజాలాన్ని ఆక్సిడేషన్‌కి గురవకుండా కాపాడుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. బాదంపప్పును రాత్రి నానబెట్టి ఉదయం తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. బాదంపప్పు, నూనె, పాలు ఇలా ఏ రూపంలో తీసుకున్నా ప్రయోజనమేనంటున్నారు […]

బాదంతో నవ యవ్వనం
Follow us

|

Updated on: Aug 26, 2019 | 3:58 PM

బాదంపప్పులో మంచి పోషకాలు ఉన్నాయి. కొవ్వులు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్థిగా వున్నాయి. బాదం నూనెను చర్మసౌందర్యంతో పాటు శిరోజాలకూ ఉపయోగిస్తారు. అంతేకాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. బాదంలో ఉండే విటమిన్ ఇ.. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణజాలాన్ని ఆక్సిడేషన్‌కి గురవకుండా కాపాడుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. బాదంపప్పును రాత్రి నానబెట్టి ఉదయం తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. బాదంపప్పు, నూనె, పాలు ఇలా ఏ రూపంలో తీసుకున్నా ప్రయోజనమేనంటున్నారు డాక్టర్లు.

*మేని చర్మానికి మెరుపు, మృదుత్వాన్నిస్తుంది. *చర్మం ముడతలను తొలగించి యవ్వనంగా ఉంచుతుంది *కండరాల నొప్పులను తగ్గిస్తుంది *కళ్ళచుట్టు వుండే నల్లచారలను నివారిస్తుంది * పెదాల పగుళ్లను అరికడుతుంది *పసి పిల్లలకు దురదలు రాకుండా చేస్తుంది * మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతాయి *అజీర్ణం అయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది. *కుదుళ్లను గట్టిపరిచి వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది *కొలెస్ట్రాల్ శాతాన్ని నియంత్రిస్తుంది *మెదడు, నాడి వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది *గుండె జబ్బులు, ఒబేసిటీ రాకుండా చేస్తుంది. *రక్తపోటును నివారిస్తుంది *కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకుంటుంది. *షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

బాదంపాలతో ప్రొటీన్‌ లభిస్తుంది. అథ్లెట్లు, జిమ్‌కు వెళ్లేవారు ఈ బాదంపాలు తీసుకుంటే వారికి కావలసిన ప్రొటీన్‌ లభిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికీ బాదం ఎంతో ఉపయోగపడుతుంది. మీ రోజువారీ డైట్‌లో బాదంను భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.