Hair care: చలికాలంలో చుండ్రు బాగా ఇబ్బంది పెడుతోందా?.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. మారుతున్న జీవనశైలికి తోడు వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి  కారణంగా ఈ

Hair care: చలికాలంలో చుండ్రు బాగా ఇబ్బంది పెడుతోందా?.. అయితే ఈ చిట్కాలు పాటించండి..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 21, 2022 | 6:47 AM

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. మారుతున్న జీవనశైలికి తోడు వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి  కారణంగా ఈ సమస్య తరచూ ఎదరువుతూ ఉంటుంది. ఇక చలికాలంలో తేమ బాగా తగ్గిపోవడం వల్ల జుట్టు పొడిబారుతుంది. చుండ్రు బాగా ఇబ్బంది పెడుతుంది. దీనిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులను వాడితే సమస్య మరీ జఠిలమయ్యే అవకాశం ఉంది. ఈక్రమంలో కొన్ని సహజ చిట్కాలతో చుండ్రును ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం రండి.

కొబ్బరి నూనె

చుండ్రును వదిలించుకోవడంలో  కొబ్బరి నూనె ప్రభావవంతంగా  పనిచేస్తుంది.   ఇందులో ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడే యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా  ఇది మీ జుట్టుకు పోషణనిస్తుంది. పొడి జుట్టుని నివారిస్తుంది. ఇందుకోసం కొన్ని చుక్కల నూనెను చేతిలోకి తీసుకుని  జుట్టు కుదళ్లకు బాగా పట్టించాలి.  ఇలా క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా

వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే పదార్థాల్లో బేకింగ్ సోడా ఒకటి. . ఇది స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అదేవిధంగా చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు  దురదను తగ్గించడంలో సహాయపడుతాయి.  ఇందుకోసం తడి జుట్టుకు బేకింగ్ సోడా నేరుగా అప్లై చేసి, మసాజ్ చేయండి.  2-3 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరి.

వేప రసం

వేపలో యాంటీ బాక్టీరియల్,  యాంటీవైరల్,  యాంటీ ఫంగల్ లక్షణాలు విరివిగా ఉంటాయి.  ముఖ్యంగా ఇందులోని  యాంటీ ఫంగల్ గుణాలు తలలోని ఫంగస్‌ను త్వరగా తొలగించడంలో సహాయపడతాయి. చుండ్రు కారణంగా కలిగే మంట, దురద నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. కొన్ని వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆపై వాటిని మెత్తగా పేస్ట్ చేయండి. అనంతరం ఈ మిశ్రమాన్ని  తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి.  అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితముంటుంది.

కలబంద

కలబందలో యాంటీ ఫంగల్ ,  యాంటీమైక్రోబయల్ లక్షణాలు అలాగే ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉన్నాయి. ఇది తలపై దురద, చుండ్రును తొలగించడంలో బాగా సహాయపడుతాయి. అంతేకాదు ఇది మాయిశ్చరైజర్ గా పనిచేసి జుట్టుకు తేమను అందిస్తుంది . అలోవెరా జెల్‌ని తలకు పట్టించి అరగంట పాటు అలాగే వదిలేయండి. ఆతర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి.

వెనిగర్

వెనిగర్‌లోని  ఔషధ గుణాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్, బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతేకాదు దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి.  వెనిగర్‌ను ఉపయోగించాలంటే, 1 కప్పు వెనిగర్‌ను 1 కప్పు నీటిలో కలిపి తలకు పట్టించాలి.  ఆతర్వాతతే లికపాటి షాంపూతో  తలస్నానం చేయాలి.

Also read: రూ. 12 డిపాజిట్ చేస్తే రూ. 2 లక్షల బీమా

TV9 Digital TOP 9 NEWS : 5జీ దెబ్బకు నిలిచిన విమానాలు.. వ్యాక్సిన్‌ వద్దంటూ చెట్టెక్కిన యువకుడు.!(వీడియో)

ICICI: ఐసీఐసీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తోంది.. కొత్త వడ్డీ రేట్లు తెలుసుకోండి..?

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..