
జామ పండ్లు దాదాపు అందరికీ సుపరిచితమే. అన్ని ప్రాంతాల్లో విరివిగా పండించే జామ పండ్లు రుచికి కూడా బలేగా ఉంటాయి. కానీ పండ్లే కాదు దీని ఆకులు కూడా ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ ఆకు రసం రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ముఖ్యంగా ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధం.
అజీర్ణ సమస్యలు ఉన్నవారికి జామ ఆకు రసం తీసుకోవడం ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి అజీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఆకును నీటిలో మరిగించి తాగడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే జామ ఆకు జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు ఈ ఆకు రసం ఒక చెంచా మరిగించి తాగితే జ్వరం వెంటనే తగ్గిపోతుందట.
జామ ఆకు రసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది శరీరం క్రిములతో పోరాడటానికి సహాయపడటమే కాకుండా, ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
జామ ఆకు రసం తాగడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు తొలగిపోతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కాంతిని పెంచడమే కాకుండా జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి.
జామ ఆకు రసం తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
జామ ఆకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ ఆకులు పాలీఫెనాల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువలన, ఇది ఆహారంలో కార్బోహైడ్రేట్ల శోషణను నియంత్రిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.