AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుట్టలాంటి మీ పొట్టను సన్నజాజి తీగలా మార్చే పానియం.. ఏ టైంలో తాగాలంటే?

చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే నిమ్మ రసం-తేనె గోరు వెచ్చని నీళ్లలో కలిపి తాగుతుంటారు. కొందరు జీలకర్ర నీరు, మెంతి నీరు, అల్లం నీరు కూడా తాగుతారు. రాత్రంతా నానబెట్టిన ఈ నీరు కొవ్వును కరిగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగే మెంతి నీరు, అల్లం నీరు కూడా ఒంట్లో కొవ్వును వేగంగా..

గుట్టలాంటి మీ పొట్టను సన్నజాజి తీగలా మార్చే పానియం.. ఏ టైంలో తాగాలంటే?
Weight Loss Drinks
Srilakshmi C
|

Updated on: Nov 02, 2025 | 12:44 PM

Share

పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వును తగ్గించుకోవడానికి మీరు ఎల్లప్పుడూ వ్యాయామం చేయవలసిన అవసరం లేదు. దానితో పాటు సరైన పానీయాలు తీసుకుంటే కొద్ది రోజుల్లోనే సన్నజాజి తీగలా మారిపోతారు. నిజానికి చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే నిమ్మ రసం-తేనె గోరు వెచ్చని నీళ్లలో కలిపి తాగుతుంటారు. కొందరు జీలకర్ర నీరు, మెంతి నీరు, అల్లం నీరు కూడా తాగుతారు. రాత్రంతా నానబెట్టిన ఈ నీరు కొవ్వును కరిగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగే మెంతి నీరు, అల్లం నీరు కూడా ఒంట్లో కొవ్వును వేగంగా కరిగించగలవని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి మెంతి నీళ్లు లేదా అల్లం నీళ్లు ఏది బెటర్‌?

నిజానికి మెంతి నీరు, అల్లం నీరు రెండూ కొవ్వును కరిగించగలవు. అయితే ఈ రెండింటికీ వేర్వేరు లక్షణాలు ఉన్నాయి. మీరు ఈ రెండు నీటిని తాగితే శరీరంలో గమనించదగ్గ వ్యత్యాసం కొద్దిరోజుల్లోనే చూస్తారు.

మెంతి నీళ్లు

మెంతులు వివిధ వంటకాల రుచిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను మరుసటి రోజు ఉదయం తినడం వల్ల బరువు తగ్గవచ్చు. మెంతులలో గెలాక్టోమన్నన్ ఉంటుంది. ఇది పదే పదే ఆకలిగా అనిపించడాన్ని నివారిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. మెంతులు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది అపానవాయువు, అజీర్ణం, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

అల్లం నీరు

అల్లం ఔషధ గుణాల గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడినా తక్కువే. ముఖ్యంగా అల్లం నీరు తాగడం వల్ల కడుపు సమస్యలు నయమవుతాయి. అల్లం నీరు కేలరీలను బర్న్ చేయడంలో, ఆకలిని నివారించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతి ఉదయం క్రమం తప్పకుండా అల్లం నీరు తాగితే, వేగంగా ఒంట్లో కొవ్వును తగ్గిస్తుంది. మరోవైపు ఇది రక్తపోటును సైతం నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఏ పానీయం ఎంచుకోవాలి?

ఎవరైనా తమ జీవక్రియను పెంచుకోవాలనుకుంటే.. అలాంటి వారు అల్లం నీరు తాగడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు, జీర్ణక్రియపై దృష్టి పెట్టాలనుకుంటే మెంతి నీటిని ఎంచుకోవచ్చు. అయితే మొదటిసారి ఈ పానీయం తాగడం ప్రారంభించాలనుకుంటే మాత్రం వీలైనంత వరకు తక్కువ పరిమాణంలో ప్రారంభించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..