సమ్మర్‌లో వెంటనే శక్తినిచ్చే ఆరోగ్య రసాలు!

సమ్మర్‌లో వెంటనే శక్తినిచ్చే ఆరోగ్య రసాలు!

ఎండాకాలం మొదలైంది.. అప్పుడే భానుడు భగభగా మండిపోతున్నాడు. దీనికి తోడు చెమట. నిజానికి శరీరం చెమల రూపంలోనే లవణాలని వేగంగా కోల్పోతుంటుంది. దాంతో మనలో నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. దీంతో ఆరారాగా.. నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తునే..

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 14, 2020 | 3:07 PM

ఎండాకాలం మొదలైంది.. అప్పుడే భానుడు భగభగా మండిపోతున్నాడు. దీనికి తోడు చెమట. నిజానికి శరీరం చెమల రూపంలోనే లవణాలని వేగంగా కోల్పోతుంటుంది. దాంతో మనలో నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. దీంతో ఆరారాగా.. నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తునే ఉన్నారు. ఇలా చేయడం ద్వారా శరీరం హెల్దీగా ఉండటమే కాకుండా.. తొందరగా అలిసిపోకుండా ఉంటారు. అలాగని రుచీపచీ లేని నీళ్లు తాగలేం అనుకునే వారికి.. పండ్ల రసాలని ప్రయత్నించండి. వీటితో శరీరానికి కావాల్సిన మూలకాలు, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి జీవక్రియల పనితీరును మెరుగుపరచడంతో పాటు తక్షణ శక్తిని అందిస్తాయి.

వాటిలో కొన్ని వేసవి కాలంలో విరివిగా దొరుకుతూంటాయి. తర్భూజ, పుచ్చకాయ, నిమ్మకాయ, పచ్చిమామిడి కాయ, దబ్బకాయ, మజ్జిగ-పుదీనా రసం వంటివి తీసుకోవడం వల్ల ఎంతో ఎనర్జీగా.. నీరసం దరిచేరకుండా ఉంటుంది. వీటివల్ల చాలా లాభాలే ఉన్నాయి.

1. ఇలాంటి రసాలు తాగడం వల్ల ఎండ వేడి వల్ల మూత్రంలో వచ్చే మంటను తగ్గించుకోవచ్చు 2. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పాడకుండా చేస్తాయి 3. మలబద్ధకం సమస్య ఉత్ఫన్నం కాదు 4. ఈ జ్యూస్‌లలో విటమిన్ – ఎ, సిలు ఎక్కువగా లభిస్తాయి 5. చర్మానికి నూతన యవ్వనం చేకూరుస్తుంది. పేగులకు కూడా చాలా మంచి చేస్తుంది 6. ఎసిడిటీ, అలర్స్ తగ్గుముఖం పడతాయి 7. ముఖ్యంగా నిమ్మకాయలు, పచ్చిమామిడి జ్యూస్‌తో పొటాషియం, బి6, బి1, బి2 విటమిన్స్ లభ్యమవుతాయి. అజీర్తి కూడా తగ్గుముఖం పడుతుంది.

ఇవి కూడా చదవండి:

విజయవాడలోని టిఫిన్ సెంటర్ వ్యాపారికి కరోనా..

లాక్‌డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu