Beauty Tips: మొటిమలు, నల్ల మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా?. అయితే అవిసె గింజల నూనెతో అందంగా మెరిసిపోండిలా..

మారుతున్న జీవనశైలికి తోడు కాలుష్యం కారణంగా ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది. ముఖ్యంగా మొటిమలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి.

Beauty Tips: మొటిమలు, నల్ల మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా?. అయితే అవిసె గింజల నూనెతో  అందంగా మెరిసిపోండిలా..
Follow us

| Edited By: Phani CH

Updated on: Jan 19, 2022 | 9:15 AM

మారుతున్న జీవనశైలికి తోడు కాలుష్యం కారణంగా ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది. ముఖ్యంగా మొటిమలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అదేవిధంగా చర్మంపై నల్ల మచ్చలు అంద వికారంగా కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడం కోసం చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు.  అయితే వీటి వల్ల ఎలాంటి ఫలితముంటుందో తెలియదు కానీ దుష్ఫ్రభావాలు మాత్రం కచ్చితంగా ఉంటాయి. అందుకే అందం కోసం ఇంట్లో దొరికే పదార్థాలనే వినియోగించడం మేలంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు.  ముఖ్యంగా అవిసె గింజల నూనె  చర్మ సంరక్షణలో బాగా సహాయపడుతుంది. చర్మాన్ని లోపల నుంచి హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు.  మరి ఈ నూనెతో మొటిమలు, నల్లమచ్చలను  ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం రండి.

చర్మానికి తేమను..

అవిసె గింజెల నూనెతో చర్మానికి అవసరమైన తేమ లభిస్తుంది. ఇందుకోసం  రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. కొద్ది సేపటి తర్వాత  ఈ నూనెను ముఖానికి మాయిశ్చరైజర్ లాగా రాసుకోవాలి.  ఆ సమయంలో  చేతులతో  మృదువుగా మసాజ్  చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితముంటుంది.  .

క్లెన్సర్ గా..

అవసరమనుకుంటే చర్మ సంరక్షణ దినచర్యలో ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌ను క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం లిన్సీడ్ ఆయిల్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. మసాజ్ చేసిన తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మురికి పదార్థాలు తొలగిపోతాయి..

చర్మాన్ని క్లీన్ చేస్తుంది..

ఫ్లాక్స్ సీడ్‌తో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం కూడా ఎంతో ఉత్తమం. ఇందుకోసం లిన్సీడ్ ఆయిల్ తీసుకుని అందులో ఓట్స్ పౌడర్ కలపాలి. మీకు కావాలంటే, మీరు దీనికి తేనెను కూడా జోడించవచ్చు. ఈ మూడింటిని మిక్స్ చేసిన తర్వాత వాటిని స్క్రబ్ చేసి సాధారణ నీటితో  ముఖాన్ని కడగాలి. అవిసె గింజల నూనె,  తేనె చర్మాన్ని హైడ్రేటెడ్  గా ఉంచడంలో సహాయపడతాయి. అదేవిధంగా వోట్స్ చర్మంలోని మురికిని తొలగిస్తుంది.

డార్క్ సర్కిల్స్ తగ్గిస్తాయి

కళ్ల కింద పడే నల్లటి వలయాలను లిన్సీడ్ ఆయిల్ తో తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ కళ్ల కింద ఉన్న ప్రదేశానికి లిన్సీడ్ ఆయిల్ అప్లై చేయండి. అయితే రాత్రిపూట పడుకోబోయే ముందు మాత్రమే ఈ నూనెను రాసుకోవాలి.  తరచూ ఇలా చేస్తుంటే కళ్లకింద  డార్క్ సర్కిల్స్ చాలా వరకు తగ్గుతాయి.

దురదను తగ్గించుకోవచ్చు..

దురద సమస్యతో బాధపడేవారు లిన్సీడ్ ఆయిల్‌ను చర్మానికి రాసుకోవచ్చు. అవిసె గింజల నూనెను దురద ఉన్న ప్రాంతాల్లో రాసి మృదువుగా రుద్దండి.  ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే  సమస్యలన్నీ దూరమవుతాయి.

Also Read: Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

జుట్టు తెల్లబడటం మొదలైందా..కంగారు పడవద్దు..వెంటనే ఇలా చేయండి…(వీడియో)

Bangarraju: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు.. బంగార్రాజు స‌క్సెస్ మీట్‌లో నాగార్జున ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..