Spinach Pakora: టేస్టీ స్నాక్.. వేడి వేడి పాలక్ పకోడీలు.. తింటే అస్సలు వదిలిపెట్టరు.!

Spinach Pakoras: చలికాలం అందులోనూ సాయంత్రం ఏదైనా వేడివేడిగా స్నాక్ చేసుకుని తింటే ఆ మజా వేరుగా ఉంటుందని చెప్పాలి. పకోడీలు(Pakoras) అయితే ఇంకా మంచిది...

Spinach Pakora: టేస్టీ స్నాక్.. వేడి వేడి పాలక్ పకోడీలు.. తింటే అస్సలు వదిలిపెట్టరు.!
Spinanch
Follow us

|

Updated on: Jan 20, 2022 | 1:03 PM

చలికాలం అందులోనూ సాయంత్రం ఏదైనా వేడివేడిగా స్నాక్ చేసుకుని తింటే ఆ మజా వేరుగా ఉంటుందని చెప్పాలి. పకోడీలు(Pakoras) అయితే ఇంకా మంచిది. అయితే సాధారణంగా ప్రతీసారి ఉల్లిపాయ, కాలిఫ్లవర్‌లతో ట్రై చేసే పకోడీలను కాసింత పక్కన పెట్టి.. ఈసారి పాలకూర(Spinach)తో పకోడీలు చేసుకోండి. భలే టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. పాలకూరలో అనేక పోషకాలు ఉన్నాయి. ఐరన్, పొటాషియం, మెగ్నీషియంతో పాటు విటమిన్ ఎ, ఇ, కె, సి, బి పాలకూరలో అధిక మోతాదులో ఉన్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాంటి పాలకూర పకోడీలు ఈవెనింగ్ టైం స్నాక్‌గా తింటే అదిరిపోతుంది కదూ.! మరి లేట్ ఎందుకు వాటిని సులభంగా తయారు చేసుకునేందుకు కావాల్సిన రెసీపీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!

పాలక్ పకోడీలకు కావాల్సిన పదార్ధాలు..

  • శెనగపిండి – 200 గ్రాములు
  • 3/4 కప్పు వాటర్
  • 1 1/2 స్పూన్ ఎర్ర మిర్చి
  • సరిపడేంత ఉప్పు
  • 100 గ్రాములు సన్నగా తరిగిన పాలకూర
  • 1 1/2 స్పూన్ పసుపు
  • 1 కప్పు నూనె
  • 2 పచ్చిమిర్చి
  • తగినన్ని మంచి నీళ్లు
  • పాలక్ పకోడీలకు కొంచెం స్పైసీ రుచిని ఇవ్వాలనుకుంటే , అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎర్ర మిరపకాయలను కలపండి.

పాలక్ పకోడీలు తయారు చేయండిలా..

మొదటిగా పాలకూరను నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. నీరు మొత్తం పోయిన తర్వాత వాటిని సన్నగా తరగండి. అలా తరిగిన ఆకులను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో శెనగపిండి వేసి కలపండి. అనంతరం తగినంత ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి వేసి.. అలాగే నీళ్లు కూడా పోసి పకోడీ పిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్‌ పెట్టి.. అందులో నూనె వేసి దాన్ని వేడి చేయాలి. ఇక నూనె వేడెక్కిన తర్వాత పకోడీల కోసం సిద్దం చేసిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా పకోడీల్లా వేస్తూ దోరగా వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. వేడివేడి టీ లేదా సాస్‌తో వీటిని సర్వ్ చేయండి.

Also Read: పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

పాలకూర ఆరోగ్య ప్రయోజనాలు…

పాలకూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. దీనిలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పాలకూరలో ఉండే విటమిన్ సి ముడతలను తగ్గిస్తుంది. అలాగే విటమిన్ డి ఎముకలకు కాల్షియం అందించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బచ్చలికూరలో విటమిన్-ఎ, విటమిన్-సి ఉంటాయి. ఈ పోషకాలు వల్ల కళ్లకు మేలు జరుగుతుంది. ఇది కళ్లలో వచ్చే మాక్యులర్ డీజెనరేషన్ సమస్యను తగ్గిస్తుంది.

Also Read: ఈ ఫోటో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. మీ కళ్లలో పదునున్నట్లే.!