Spicy Paneer Fried Rice: సింపుల్‌గా టేస్టీ స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్.. టేస్ట్ అదుర్స్ అంతే..

న్నీర్‌తో సులువుగా, రుచిగా ఇంట్లో చేసుకోదగిన వాటిల్లో స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. పన్నీర్ కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి.. ఎంత తిన్నా ఎలాంటి నష్టం లేదు..

Spicy Paneer Fried Rice: సింపుల్‌గా టేస్టీ స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్.. టేస్ట్ అదుర్స్ అంతే..
Spicy Paneer Fried Rice
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 11, 2024 | 9:39 PM

పన్నీర్ అంటే వెజిటేరియన్స్‌కే కాకుండా నాన్ వెజిటేరియన్స్‌కి కూడా చాలా ఇష్టం. పన్నీర్‌తో ఏం చేసినా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. పన్నీర్ స్నాక్స్, రైస్ ఐటెమ్స్, కర్రీలు చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా పన్నీర్‌తో చేసిన స్టాటర్స్ తింటూ ఉంటారు. పన్నీర్‌తో ఏం చేసినా అదుర్స్ అంతే. ఇక పన్నీర్‌తో సులువుగా, రుచిగా ఇంట్లో చేసుకోదగిన వాటిల్లో స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. పన్నీర్ కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి.. ఎంత తిన్నా ఎలాంటి నష్టం లేదు. మరి స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

పన్నీర్, ఉడికించిన అన్నం, కారం, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, గరం మసాలా, ఆయిల్, బియ్యం పిండి, మొక్క జొన్న పిండి.

స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్‌ తయారీ విధానం:

పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ముందుగా అన్నాన్ని పొడిపొడిగా ఉడికించి పెట్టుకోవాలి. ఆ తర్వాత పన్నీర్‌ని క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి బియ్యం పిండి, మొక్క జొన్న పిండి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇందులో పన్నీర్ ముక్కలు వేసి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుని తీసుకుని.. ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత కూరగాయ ముక్కలు వేసి పెద్ద మంట మీద ఓ ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి మరో ఐదు నిమిషాలు వేయించండి.

ఇవి కూడా చదవండి

ఇవి వేగిన తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి వేసి ఓ రెండు నిమిషాలు వేయించాక ఉడికించిన అన్నం వేసి అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత సోయా సాస్ కూడా వేసి అంతా కలిసేలా కలపాలి. ఇదంతా మాడకుండా పెద్ద మంట మీదనే చేయాలి. అప్పుడే అన్నం చాలా రుచిగా ఉంటుంది. అంతే ఎంతో రుచిగా ఉండే స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ సిద్ధం.