Guntur Famous Vankaya Bajji: గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీ.. ఇలా చేస్తే సూపరో సూపర్!

| Edited By: Ravi Kiran

Sep 26, 2024 | 8:54 PM

ఒక్కో ప్రదేశానికి ఒక్కో ఫుడ్ ఐటెమ్ చాలా ఫేమస్ అవుతుంది. అలా ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరులో వంకాయ బజ్జీలు కూడా చాలా ఫేమస్. గుంటూరుకు వచ్చిన వాళ్లు ఎవరైనా సరే వంకాయ బజ్జీ తినకుండా వెళ్లరు. ఇక్కడ బజ్జీలు అంత రుచిగా ఉంటాయి. అక్కడికి వెళ్లలేని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మరి గుంటూరు స్టైల్‌లో అక్కడ వంకాయ బజ్జీ ఎలా తయారు చేస్తారో.. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీని ఎంతో సింపుల్‌గా, టేస్టీగా తయారు..

Guntur Famous Vankaya Bajji: గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీ.. ఇలా చేస్తే సూపరో సూపర్!
Guntur Famous Vankaya Bajji
Follow us on

ఒక్కో ప్రదేశానికి ఒక్కో ఫుడ్ ఐటెమ్ చాలా ఫేమస్ అవుతుంది. అలా ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరులో వంకాయ బజ్జీలు కూడా చాలా ఫేమస్. గుంటూరుకు వచ్చిన వాళ్లు ఎవరైనా సరే వంకాయ బజ్జీ తినకుండా వెళ్లరు. ఇక్కడ బజ్జీలు అంత రుచిగా ఉంటాయి. అక్కడికి వెళ్లలేని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మరి గుంటూరు స్టైల్‌లో అక్కడ వంకాయ బజ్జీ ఎలా తయారు చేస్తారో.. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీని ఎంతో సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పెద్దగా సమయం కూడా పట్టదు. ఒక్కసారి వీటిని రుచి చూశారంటే.. పచ్చి మిర్చి బజ్జీల కంటే వీటినే మళ్లీ వేసుకుని తింటారు.

వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు:

వంకాయలు, చనగ పిండి, ఉప్పు, సోడా, బియ్యం పిండి, ఉల్లిపాయలు, తెల్ల నవ్వులు, కారం, జీలకర్ర, చింత పండు, నిమ్మరసం, ఆయిల్, పల్లీలు.

గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీ తయారీ విధానం:

ముందుగా పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక లోతైన గిన్నె తీసుకుని అందులో చనగ పిండి, ఉప్పు, వంట సోడా, బియ్యం పిండి, నీళ్లు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, పల్లీలు, జీలకర్ర, ఉప్పు, కారం, చింత పండు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇది నీళ్లు వేయకుండా ముద్దుగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని అందులో కొద్దిగా కారం వేయాలి. ఇందులో నిమ్మరసం పిండి పక్కన పెట్టాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు వంకాయలకు గాట్లు పెట్టి ఓ 50 శాతం వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇవి చల్లారాక ముందుగా తయారు చేసుకున్న ఉల్లి మసాలా పేస్ట్ స్టఫ్ చేసుకోవాలి. ఇలా మీకు కావాల్సిన వంకాయలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు స్టఫ్ చేసిన వంకాయను తీసుకుని వీటిని చనగ పిండి మిశ్రమంలో ముంచి.. ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. మధ్యలో కట్ చేసి వేయించిన పల్లీలు, నిమ్మరసం పిండిన కారం వేసి ఉల్లిపాయలు పెట్టి తింటే ఆహా అంటారు.