Makhana Chivda: ఫూల్ మఖానాతో చిడ్వా.. పిల్లలకు బెస్ట్ స్నాక్..

ఫూల్ మఖానా ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే. వీటితో కూరలు, స్నాక్స్, స్టాటర్స్ ఇలా చాలానే తయారు చేసుకోవచ్చు. వీటితో చేసిన రెసిపీలు చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇందులో పోషకాలు అన్నీ ఇన్నీ కావు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఫూల్ మఖానా తినడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇంత ఆరోగ్యకరమైన మఖానాతో పిల్లలు ఇష్టపడి తినేలా ఓ హెల్దీ స్నాక్ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా చిడ్వా లేదా చివ్‌డా..

Makhana Chivda: ఫూల్ మఖానాతో చిడ్వా.. పిల్లలకు బెస్ట్ స్నాక్..
Makhana Chivda
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 21, 2024 | 10:05 PM

ఫూల్ మఖానా ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే. వీటితో కూరలు, స్నాక్స్, స్టాటర్స్ ఇలా చాలానే తయారు చేసుకోవచ్చు. వీటితో చేసిన రెసిపీలు చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇందులో పోషకాలు అన్నీ ఇన్నీ కావు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఫూల్ మఖానా తినడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇంత ఆరోగ్యకరమైన మఖానాతో పిల్లలు ఇష్టపడి తినేలా ఓ హెల్దీ స్నాక్ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా చిడ్వా లేదా చివ్‌డా అటుకులతో తయారు చేస్తారు. కానీ ఫూల్ మఖానాతో చేస్తే ఆ రుచే వేరు. ఇది చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

ఫూల్ మఖానా చిడ్వాకి కావాల్సిన పదార్థాలు:

ఫూల్ మఖానా, పల్లీలు, కొబ్బరి ముక్కలు, ఎండు మిర్చి, కరివేపాకు రెమ్మ, బాదం, జీడిపప్పు, పసుపు, కారం, ఉప్పు, పుట్నాలు, నెయ్యి, ఆయిల్.

ఫూల్ మఖానా చిడ్వా తయారీ విధానం:

ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో కొద్దిగా మఖానా వేసి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని దోరగా వేయించికున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, వేరు శనగ ఒకదాని తర్వాత మరొకటి వేసి రంగు మారేంత వరకూ ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఆ నెక్ట్స్ పుట్నాలు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇవి అస్సలు మాడకుండా చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లోనే కారం, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. కావాలి అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో నట్స్, మఖానా వేసి అన్నీ మొత్తం ఒకసారి కలిపి వేయించాలి. ఆ తర్వాత వీటిని బాగా చల్లార్చాలి. అనంతరం గాలి దూరని ఓ స్టీల్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మఖానా చిడ్వా సిద్ధం.