Spicy Lassi: మీరు ఇలాంటి స్పైసీ లస్సీని ఎప్పుడైనా తాగారా.. ఇంట్లోనే సులువుగా తయారు చేయండి..!

Spicy Lassi: మీరు ఇలాంటి స్పైసీ లస్సీని ఎప్పుడైనా తాగారా.. ఇంట్లోనే సులువుగా తయారు చేయండి..!
Spicy Lassi

Spicy Lassi: ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేట్‌గా ఉంచడానికి కొన్ని రకాల పానీయాలు ఉపయోగకరంగా ఉంటాయి.

uppula Raju

|

May 11, 2022 | 6:40 AM

Spicy Lassi: ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేట్‌గా ఉంచడానికి కొన్ని రకాల పానీయాలు ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా లస్సీ తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. మీరు భారతదేశంలో వివిధ రకాల లస్సీలను తాగవచ్చు. ప్రతి నగర ప్రజలు లస్సీకి ఒక పదార్ధాన్ని కలపడం ద్వారా కొత్త రుచిని సృష్టిస్తారు. ఇది ఆయా ప్రాంతాల్లో చాలా ఫేమస్‌ అవుతుంది. వాస్తవానికి లస్సీని మూడు రకాలుగా తయారుచేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

1. సౌత్ ఇండియన్ స్టైల్ లస్సీ

మీరు సాధారణ లస్సీ తాగి విసుగు చెందితే ఈ రోజు సౌత్ ఇండియన్ లస్సీ గురించి తెలుసుకుందాం. మీరు ఇంతకు ముందు ఇలాంటి లస్సీ తాగి ఉండరు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం.

అవసరమైన పదార్థాలు: అల్లం, పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి), కరివేపాకు (5-6 ఆకులు), పెరుగు, సరిపడ ఉప్పు,

ఎలా చేయాలి: సౌత్ ఇండియన్ స్టైల్ లస్సీ చేయడానికి ముందుగా అల్లం తొక్కను తీసేయాలి. తరువాత పెరుగును బాగా చిలకరించాలి. ఇప్పుడు దానికి కొంచెం నీరు కలపాలి. తరవాత రుచి ప్రకారం ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. అన్ని వస్తువులను బాగా కలపాలి. అంతే మీకు కావలసిన లస్సీ తయారైనట్లే.

2. పుదీనా మసాలా లస్సీ

పుదీనాని లస్సీకి కూడా ఉపయోగించవచ్చు. వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచడంలో పుదీనా సహాయపడుతుంది. మీరు భోజనం తర్వాత ఈ రకమైన లస్సీని తాగితే మంచిది. పుదీనా మసాలా లస్సీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు: 2 కప్పుల పెరుగు, అర కప్పు చల్లని నీరు, జీలకర్ర పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, చిటికెడు గ్రౌండ్ నల్ల మిరియాలు, నిమ్మకాయ, 10-12 పుదీనా ఆకులు,

ఎలా చేయాలి: మొదటగా 2 కప్పుల చల్లని పెరుగు తీసుకోవాలి. ఇందులో అరకప్పు చల్లటి నీరు కలపాలి.తర్వాత టేబుల్‌ స్పూన్ జీలకర్ర పొడి, చాట్ మసాలా, నల్ల మిరియాలు కలపాలి. నల్ల మిరియాలు లస్సీని కారంగా మారుస్తాయి. కానీ వీటిని ఎక్కువగా ఉపయోగించవద్దు. ఇప్పుడు 10-12 పుదీనా ఆకులను బాగా కడగాలి. తర్వాత పెరుగులో వేయాలి. అలాగే ఇందులో కొద్దిగా నిమ్మకాయను పిండాలి. ఇప్పుడు అన్ని పదార్థాలని బాగా కలపాలి. మీ పుదీనా మసాలా లస్సీ రెడీ అయినట్లే.

మరిన్ని ఆహార వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్

Viral Video: తెల్లపులి, పసుపు పులి మధ్య భీకర పోరు.. మామూలుగా లేదు ఫైట్‌..!

IPL 2022 points table: ప్లే ఆఫ్‌ రేసులో కోల్‌కతా.. ముంబైపై విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu