Health Tips: మొలకెత్తిన ఉల్లిపాయలతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అసలు వదిలి పెట్టరు..

Sprouts Onions health benefits: వేసవిలో ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగాహీట్ స్ట్రోక్‌ను నివారించడంలో ఉల్లిపాయ సమర్థంగా పనిచేస్తుంది

Health Tips: మొలకెత్తిన ఉల్లిపాయలతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అసలు వదిలి పెట్టరు..
Sprouts Onions
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 19, 2022 | 8:32 AM

Sprouts Onions health benefits: వేసవిలో ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగాహీట్ స్ట్రోక్‌ను నివారించడంలో ఉల్లిపాయ సమర్థంగా పనిచేస్తుంది. అందుకే చాలామంది ఆహారంతో పాటు బ్యూటీకేర్‌ రొటీన్‌లో ఈ ఉల్లిపాయలను భాగం చేసుకుంటారు. ముఖ్యంగా కురుల సంరక్షణలో ఉల్లిపాయ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది . ఉల్లిపాయ రసం లేదా నూనెతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వంటల్లో దీని ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒక్కోసారి ఉల్లిపాయలకు మొలకలు వస్తుంటాయి. అయితే చాలామంది వీటిని కొసేస్తుంటారు. మరికొందరికి వాటిని ఉపయోగించాలా? వద్దా? అనే అనుమానాలతో పక్కన పెడుతుంటారు. అయితే మొలకెత్తిన ఉల్లిపాయలు (Sprouts Onions) బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే..

* మొలకెత్తిన ఉల్లిపాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే, అది శరీరంలోని విటమిన్ సి లోపాన్ని తొలగిస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి మరింత మెరగవుతుంది.

* ఈ ఉల్లిపాయల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరిపడా ఫైబర్‌ తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు దూరంగా ఉంటాయి. మొలకెత్తిన ఉల్లిపాయలను పచ్చిగా తినడం ద్వారా వీటి ప్రయోజనాలను పొందవచ్చు.

* మొలకెత్తిన ఉల్లిపాయల్లో క్యాల్షియం, ఫాస్పరస్ గుణాలు కూడా సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని రోజూ తగిన మోతాదులో తీసుకుంటే దంతాలు, ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు.

* వేసవి కాలంలో మొలకెత్తిన ఉల్లిపాయలను సలాడ్ రూపంలో తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

*మొలకలు వచ్చిన ఉల్లి పాయల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మొలకలు నేరుగా తింటే కాస్త చేదుగా అనిపించవచ్చు. అందుకే ఉల్లి ముక్కలను కూరల్లో వేసుకొని తినడం మంచిది.

Also Read: RR vs KKR, IPL 2022: చాహల్‌ ‘పాంచ్‌’ పటాకా.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్‌ గెలుపు..

Delhi Violence: కాల్పులు జ‌రిపిన‌ సోనూ చిక్నా అరెస్ట్.. ఢిల్లీ అల్లర్ల కేసులో చురుగ్గా పోలీసుల దర్యాప్తు..

New Army Chief: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే.. తొలిసారి ఇంజినీర్‌కు భారత సైన్యం బాధ్యతలు..