Kerala Egg Roast: కేరళ స్పెషల్ వంటకం..టేస్టీ టేస్టీ కేరళ ఎగ్ రోస్ట్ తయారీ ఎలా అంటే..

Kerala Egg Roast: కోడిగుడ్డు పౌష్టికాహారం. రోజు తినే ఆహారంలో కోడి గుడ్డుని చేర్చుకోమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది కోడిగుడ్డిని ఉడకబెట్టుకుని..

Kerala Egg Roast: కేరళ స్పెషల్ వంటకం..టేస్టీ టేస్టీ కేరళ ఎగ్ రోస్ట్ తయారీ ఎలా అంటే..
Kerala Egg Roast

Kerala Egg Roast: కోడిగుడ్డు పౌష్టికాహారం. రోజు తినే ఆహారంలో కోడి గుడ్డుని చేర్చుకోమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది కోడిగుడ్డిని ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు ఈ కోడి గుడ్ల తో అనేక రకాలైన ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఎగ్ ఆమ్లెట్ , బయిల్డ్ ఎగ్ వంటి టిఫిన్స్ గానే కాదు.. అన్నంలోకి గుడ్డుతో అనేక రకాలైన కూరలను తయారు చేస్తారు. ఈరోజు కేరళ స్పెషల్ వంటకం.. రుచికరమైన కేరళ ఎగ్ రోస్ట్ తయారీ గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు: 

ఉడికించిన గుడ్లు- 12 కరివేపాకు-20 లవంగాలు-6 పెద్ద ఎర్ర ఉల్లిపాయలు-6( సన్నగా కోయాలి) బే ఆకులు-4 ఏలకులు-4 టొమాటోలు-2 (మీడియం బాగా పండినవి- ముక్కలు) సముద్ర ఉప్పు-2 స్పూన్ పసుపు-1/2 స్పూన్ జీలకర్ర-1/2 స్పూన్ సోపు గింజలు1/4 టీస్పూన్ నల్ల మిరియాలు-1/4 స్పూన్ దాల్చిన చెక్క-చిన్న ముక్క అల్లం పేస్ట్ కొంచొం కొత్తిమీర నూనె సరిపడా తయారీ విధానం: కరివేపాకు, లవంగాలు, బే ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క , జీలకర్ర గింజలను నూనెలో వేసి వేయించండి. మీడియం ప్లేమ్ మీద వేయించండి.. తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసి మంచి సువాసన వచ్చే వరకు సుమారు 1 నిమిషం వేయించాలి. స్టౌ మంట స్విమ్ లో పెట్టి.. నెక్స్ట్ఉల్లిపాయలు, ఉప్పు , పసుపు వేసి..  15-20 నిమిషాలు ఉడికించాలి. ఉల్లిపాయలు బ్రౌన్  కలర్ వచ్చే వరకూ వేయించాలి. ఇలా ఉల్లిపాయలు వేయిస్తున్న సమయంలోనే సోంపు గింజలు, మిరియాలను పౌడర్ పట్టుకోండి.  ఉల్లిపాయల మిశ్రమంలో ఉడికించిన గుడ్లు వేసి.. లేత గోధుమరంగు లోకి గుడ్లు వచ్చేవరకూ 2-3 నిమిషాలు వేయించాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసి.. నీరు ఆవిరి అయ్యేవరకూ ఉడికించుకోవాలి. చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసి.. కొంచెం సేపు ఉడికించుకోవాలి. చివరిగా సోంపు, మిరియాల పౌడరు వేసుకుని ఉప్పు సరిపడేలా వేసుకుంటే.. కేరళ స్పెషల్ గుడ్డు కర్రీ రెడీ.. వేడి వేడి సర్వ్ చేసుకుంటే.. ఆహా ఏమిరుచి అంటూ తినడం ఖాయం..

Also Read:  పెళ్లి ఊరేగింపులో బాహుబలి బళ్లాలదేవ సింహాసనంపై ఊరేగిన వరుడు.. వీడియో వైరల్..

Click on your DTH Provider to Add TV9 Telugu