Health Tips: వేసవిలో అతిగా నీరు తాగుతున్నారా.. ఈ సమస్యల బారిన పడే ఛాన్స్..

Over hydration: లిక్విడ్ డైట్ తీసుకోవడం, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది. దీంతో శరీరానికి ఎంతమేరకు అవసరమో, అంతే ద్రవ పదార్థాలను అందివ్వడం మంచిది.

Health Tips: వేసవిలో అతిగా నీరు తాగుతున్నారా.. ఈ సమస్యల బారిన పడే ఛాన్స్..
Overhydration
Follow us

|

Updated on: Apr 28, 2022 | 8:59 AM

Liquid Diet: ప్రస్తుతం వేసవి కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలా అని అతి జాగ్రత్తలు కూడా మనల్ని ప్రమాదంలో పడేస్తాయని గుర్తుంచుకోవాలి. ఎండాకాలంలో తగినంత నీరు తాగాలని గుర్తుంచుకోవాలి. లేదంటే డీ హైడ్రేషన్ సమస్య వేధిస్తుంది. అలా అని ఎక్కువ నీరు తాగితే మాత్రం ఓవర్ హైడ్రేషన్ అనే సమస్య వేధిస్తుంది. వేసవి కాలంలో నీరు శరీరానికి చాలా ముఖ్యమైనది. నీళ్లే కాకుండా పాలు, లస్సీ, మజ్జిగ, సిరప్ మొదలైన ఇతర ద్రవాలు కూడా తీసుకోడం ద్వారా శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతాయి. కానీ, కొందరు వ్యక్తులు చాలా తక్కువ నీరు తాగుతారు. చాలా తక్కువ ద్రవ ఆహారం తీసుకుంటారు. దీంతో వారు డీహైడ్రేషన్‌ను ఎదుర్కొంటారు.

చర్మం పొడిబారడం, నోటి దుర్వాసన, నోరు పొడిబారడం, ఎసిడిటీ మొదలైన సందర్భాల్లో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ నీరు తాగే వారిని కూడా చూస్తుంటాం. ఎక్కువ నీరు తాగకూడదని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. ఎందుకంటే అలాంటి వారికి వికారం, వాంతులు, తలనొప్పి, రక్తపోటు, శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించడం, కండరాల బలహీనత, కండరాల దృఢత్వం లేకపోవడం, మానసిక స్థితిలో మార్పులు లాంటి సమస్యలు మొదలవుతాయని అంటున్నారు.

మీకు ఇలాంటి సమస్యలు ఉంటే.. మీరు రోజంతా తగినంత ద్రవాలను తీసుకుంటున్నట్లు భావిస్తే, మీరు అధికంగా హైడ్రేట్ అవుతున్నారో లేదో తనిఖీ చేసుకోవడం ముఖ్యం. అంటే, శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ద్రవాన్ని ఇవ్వడం సరికాదని గుర్తించాల్సి ఉంటుంది.

తాగే నీటి పరిమాణంపై కచ్చితంగా శ్రద్ధ వహించాలి. సాధారణంగా 3 నుంచి 4 లీటర్ల లిక్విడ్ తీసుకుంటే శరీరంలో ఎలాంటి సమస్యా ఉండదు. మీరు 8 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ద్రవం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలు సంభవిస్తాయి.

నీటి పరిమాణాన్ని పరిమితం చేసుకోవడం ద్వారా మీరు కొబ్బరి నీరు, నిమ్మరసం, షర్బత్, సూప్ మొదలైనవాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవన్నీ లిక్విడ్ డైట్‌లో భాగంగా తీసుకోవాలి. కాబట్టి మీ లిక్విడ్ డైట్‌ను లెక్కించేటప్పుడు, ఈ విషయాలను కూడా చేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు మూడు నుంచి నాలుగు లీటర్ల లిక్విడ్ డైట్ తీసుకున్న రోజులో, సూప్, షర్బత్ మొదలైనవాటిని కూడా లెక్కించాల్సి ఉంటుంది.

లిక్విడ్ డైట్‌లో కాకుండా కెఫిన్‌తో తయారు చేసిన టీ, కాఫీ, ఇతర పానీయాలను వేరుగా ఉంచడం మంచిది. ఎందుకంటే అవి శరీరంలో నీటి కొరతను తొలగించవు. కానీ, శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని బయటకు తీయడానికి పని చేస్తాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోవాలి. టీవీ9 తెలుగు వీటిని నిర్ధారించలేదు. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Expensive Mango: ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు..సూర్య రశ్మి గుడ్లుగా ప్రసిద్ధి.. కిలో 2.70 లక్షలు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..

Apple Seeds: యాపిల్ గింజలు శరీరంపై విష ప్రభావం చూపుతాయా? వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.