Lifestyle: ఎక్కువ కాలం బతకాలని ఉందా.? వెంటనే వీటిని ఆపేయండి..
ఎక్కువకాలం జీవించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అది సర్వసాధారణమైన విషయం. అందుకే జీవనశైలిని మార్చుకుంటారు. తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటారు. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నిజంగా మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే మాత్రం జీవితంలో కొన్ని విషయాలను...

ఎక్కువకాలం జీవించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అది సర్వసాధారణమైన విషయం. అందుకే జీవనశైలిని మార్చుకుంటారు. తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటారు. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నిజంగా మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే మాత్రం జీవితంలో కొన్ని విషయాలను వెంటనే ఆపేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆరోగ్యం బాగుండాలంటే ఆపేయాల్సినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ప్రాసెసెడ్ ఫుడ్‌కు పూర్తిగా దూరం ఉండాలి. వీటిలో అధికంగా ఉండే ఉప్పు, కొవ్వును ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాలక్రమేణ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాసెస్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇక ఎక్కువ కాలం జీవించాలంటే ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ సేవించడం వల్ల లివర్ మొదలు ఎన్నో బాడీ పార్ట్స్‌పై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ఆరోగ్యాన్ని త్వరగా దెబ్బ తీయడంలో స్మోకింగ్ కూడా ఒక కారణం. స్మోకింగ్ వల్ల జీవితకాలం క్రమంగా తగ్గుతుంది. అందుకే ఎక్కువ కాలం జీవించాలంటే కచ్చితంగా స్మోకింగ్‌ను మానేయాలని నిపుణులు చెబుతున్నారు.
* గంటలతరబడి ఒకే చోటు కూర్చోవడాన్ని వెంటనే వదిలేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గంటలతరబడి ఒకే చోట కూర్చొని పనిచేయడం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. కనీసం రెండు గంటలకు ఒకసారైనా లేచి అటు, ఇటు నడవాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇక ఎట్టి పరిస్థితుల్లో నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కూడా అనారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కచ్చితంగా ప్రతీ రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
* ఒత్తిడితో కూడుకున్న జీవితం కూడా అనారోగ్యాన్ని పెంచుతుంది. శారీరక సమస్యలతో మానసిక సమస్యలకు కూడా ఇది కారణమవుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకునే యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.
* ఇక తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయిల ఎక్కువగా ఉండే ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి…
