Raddish: ఎక్కువ కాలం పాటు ముల్లంగిని నిల్వ ఉంచాలనుకుంటున్నారా?.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

భారతీయ వంటకాల్లో ముల్లంగిది ప్రత్యేక స్థానం. దీనిని విడిగా తినడం లేదా పలు ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.  ముల్లంగి రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా

Raddish: ఎక్కువ కాలం పాటు ముల్లంగిని నిల్వ ఉంచాలనుకుంటున్నారా?.. అయితే  ఈ చిట్కాలు పాటించండి..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 21, 2022 | 6:29 AM

భారతీయ వంటకాల్లో ముల్లంగిది ప్రత్యేక స్థానం. దీనిని విడిగా తినడం లేదా పలు ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.  ముల్లంగి రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.  అయితే ఎన్నో ఆరోగ్య పోషకాలున్న ముల్లంగిని నిల్ల చేయడంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటి వల్ల  త్వరగా పాడై తినడానికి ఏ మాత్రం పనికిరాకుండా పోతుంది.   ఈక్రమంలో ముల్లంగిని చాలా కాలం పాటు తాజాగా ఉండేలా ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం రండి.

ఇతర కూరగాయలతో కలపవద్దు

ముల్లంగి కొని తెచ్చిన తర్వాత చాలామంది ఇతర కూరగాయలతో దానిని కలిపి నిల్వ ఉంచుతుంటారు.  ఇలా చేయడం వల్ల ముల్లంగి త్వరగా పాడువుతుంది. అందుకే దీనిని ఎప్పుడూ విడిగానే నిల్వ చేయాలి.

ఆకులను కత్తిరించవద్దు

ముల్లంగి  ఎక్కువ రోజులు తాజాగా ఉండాలనుకుంటే వాటి ఆకులను అసలు కత్తిరించవద్దు.  ఆకుపచ్చ ఆకులు ఉండటం వల్ల ముల్లంగి తాజాగా  ఉంటుంది.  ఇక ముల్లంగి ఆకులలో ఒకటి నుండి రెండు ఆకులు పసుపు రంగులోకి మారినట్లయితే, వాటిని కూడా కత్తిరించి వేరు చేయాలి . ఇక ఎప్పటికప్పుడు ఆకులను నీటితో తడుపుతూ ఉండాలి.

ఫ్రిజ్‌లో నిల్వ చేయవద్దు

మనలో చాలా మంది ముల్లంగిని ఫ్రిజ్‌లో ఉంచుతాము ఎందుకంటే అందులో ఉంచడం వల్ల అది తాజాగా ఉంటుందని భావించడమే దీనికి కారణం. . కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు.  ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువుల వాసన ముల్లంగిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీంతో ముళ్లంగి కుళ్లిపోతుంది.  అదేవిధంగా ముల్లంగి వల్ల మిగిలిన ఆహార పదార్థాలు కూడా పాడవుతాయి. ఇక ముల్లంగిని కొన్నిసార్లు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని చక్కెర స్థాయులు పెరుగుతాయి.  ఫలితంగా ముల్లంగి పాడైపోయే అవకాశం ఉంది.

కట్ చేసి నిల్వ చేయవద్దు

ఏదైనా కూరగాయ లేదా ఇతర రెసిపీలో కలిపిన తర్వాత మిగిలిపోయిన ముల్లంగి ముక్కలను అలాగే నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల ముల్లంగి త్వరగా కుళ్లిపోతుంది. ముల్లంగి ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉన్నట్లయితే, దానిని బయటకు తీయకుండా అలాగే ఉంచండి. అలాగే వేడి ఎక్కువగా ప్రదేశాల్లో దీనిని అసలు ఉంచవద్దు.

Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..

Viral Video: 1,019 అక్షరాలతో ఎంత పె…ద్ద.. ‘పేరు’..! గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన అమ్మాయిని చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..(వీడియో)

Massive 555-Carat Black Diamond: ఆకాశంలోంచి ఊడిపడిన బ్లాక్ డైమండ్.. అతి పెద్ద నల్ల వజ్రం స్పెషాలిటీ ఏంటంటే..(వీడియో)