Dengue : డెంగ్యూ బారిన పడ్డారా.. త్వరగా కోలుకోవాలంటే, ఈ మార్పులు తప్పనిసరి..

ప్రస్తుతం డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దోమకాటు కారణంగా వచ్చే ఈ వ్యాధి. కొన్ని సందర్భాల్లో ప్రాణం పోయే పరిస్థితికి కూడా దారితీస్తుంది. రక్తంలో వేగంగా ప్లేట్లెట్స్ పడిపోవడం కారణంగా మనిషి తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. అందుకే డెంగ్యూ వచ్చిన వారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు...

Dengue : డెంగ్యూ బారిన పడ్డారా.. త్వరగా కోలుకోవాలంటే, ఈ మార్పులు తప్పనిసరి..
Dengue Fever
Follow us

|

Updated on: Sep 22, 2024 | 5:05 PM

ప్రస్తుతం డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దోమకాటు కారణంగా వచ్చే ఈ వ్యాధి. కొన్ని సందర్భాల్లో ప్రాణం పోయే పరిస్థితికి కూడా దారితీస్తుంది. రక్తంలో వేగంగా ప్లేట్లెట్స్ పడిపోవడం కారణంగా మనిషి తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. అందుకే డెంగ్యూ వచ్చిన వారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. డెంగ్యూ బారిన పడగానే వైద్యుల సూచనలతో పాటు, తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బెంగళూరు నుంచి త్వరగా కోలుకోవడానికి తీసుకునే ఆహారంలో కొన్నింటిని భాగం చేసుకోవాలి. ఇంతకీ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

* డెంగ్యూ చికిత్సలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. అయితే బొప్పాయి ఆకులను రసం చేసుకుని తాగడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా బొప్పాయి ఆకుల రసం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రసాన్ని నీటిలో కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మెరుగైన ఫలితం పొందవచ్చు.

* డెంగ్యూ బారిన పడినవారిలో డిహైడ్రేషన్ సమస్య సర్వసాధారణం. అందుకే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొబ్బరి నీళ్లను తాగాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే డెంగ్యూ బాధితులు కచ్చితంగా కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.

* రోగ నిరోధక శక్తిని పెంచడంలో మేకపాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మేక పాలలో ఉండే సెలెనియం రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో ఎలాంటి వైరస్ అయిన వృద్ధి చెందకుండా ఆపడంలో మేకపాలు ఉపయోగపడతాయి.

* డెంగ్యూ పేషంట్స్ కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో కివీ కూడా ఒకటి. కివి పండు విటమిన్ సి కి పెట్టింది పేరు. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కివి పండు దోహదపడుతుంది. అందుకే డెంగ్యూ పేషెంట్స్ కచ్చితంగా ఈ పండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుంది. డెంగ్యూ చికిత్సలో వేపాకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే పడగడుపున లేత వేప ఆకులు నమలడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నోట్ : పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులకు సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..