Beauty Tips: ట్రాఫిక్‌లో తిరగడంతో ముఖం జిడ్డుగా మారుతుందా.? ఈ న్యాచురల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి..

Beauty Tips: ట్రాఫిక్‌లో తిరగడంతో ముఖం జిడ్డుగా మారుతుందా.? ఈ న్యాచురల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి..
Beauty Tips

Beauty Tips: ప్రస్తుత రోజుల్లో కాలుష్యం సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన వాహనాల రద్దీ ప్రస్తుతం చిన్న పట్టణాల్లోనూ పెరిగిపోతోంది. అంతేకాకుండా మారుతోన్న వృత్తి సంస్కృతి కారణంగా బయట తిరిగి చేసే పనులు కూడా పెరుగుతున్నాయి...

Narender Vaitla

|

Mar 05, 2022 | 6:45 AM

Beauty Tips: ప్రస్తుత రోజుల్లో కాలుష్యం సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన వాహనాల రద్దీ ప్రస్తుతం చిన్న పట్టణాల్లోనూ పెరిగిపోతోంది. అంతేకాకుండా మారుతోన్న వృత్తి సంస్కృతి కారణంగా బయట తిరిగి చేసే పనులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషులు ఎక్కువగా ట్రాఫిక్‌లో తిరుగుతుంటారు. ఇలా ట్రాఫిక్‌లో తిరుగుతూ ఇంటికి వెళ్లే సరికి ముఖం జిడ్డుగా, నల్లగా మారుతుంటుంది. అయితే ఇలా నల్లాగా మారిన ముఖాన్ని కొన్ని సహజ చిట్కాల ద్వారా ప్రకాశవంతంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా.? జిడ్డుగా మారిన ముఖానికి కాంతిని తిరిగి తేవాలంటే పాటించాల్సిన ఆ న్యాచురల్‌ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  1. ముఖంపై పేరుకు పోయిన జిడ్డును తొలగించడంలో పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం పైనాపిల్‌ను ముక్కలుగా కోసి వాటితో ముఖంపై బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
  2.  ముఖాన్ని క్లీన్‌ చేయడానికి ఆరెంజ్‌ జ్యూస్‌ కూడా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఉండే విటమిన్‌ సి చర్మానికి మెరుపును ఇస్తుంది. రెండు టేబుల్‌ స్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌ను తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ ప్యాక్‌ను ముఖానికి రాసి 20 నిమిషాల పాటు ఉండాలి. అనంతరం సాధారణ నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్‌ ఉంటుంది.
  3. ఇక చర్మ ఆరోగ్యానికి తేనె కూడా బాగా ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక టీస్పూన్‌ తేనె, ఒక టీస్పూన్‌ కాఫీ పొడి, కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ముఖంపై అప్లై చేయాలి. కొన్ని నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
  4.  బొప్పాయిని పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. బొప్పాయిలోని ఎంజైమ్స్‌ చర్మాన్ని శుభ్రం చేస్తాయి. ముఖంలోని నలుపుదనాన్ని పోగొడుతుంది.
  5.  కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి మిక్స్‌ చేసి దాన్ని ముఖానికి రాయాలి. 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. రోజూ ఇలా రెండు సార్లు చేయాలి. దీంతో ముఖంపై ఉండే దుమ్ము, ధూళి, మృత కణాలు పోతాయి.

Also Read: NCSM Jobs 2022: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Viral Video: పిల్లే అయినా పులిలా వేటాడింది.. వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu