Vitamins Deficiency: ఎప్పుడూ అలసటగానే అనిపిస్తోందా.. ఇదే లోపం కావచ్చు..

|

Sep 25, 2024 | 2:55 PM

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో.. ఉరుకుల పరుగుల జీవితంగా మారింది. ఈ జీవితంలో విశ్రాంతి లేకుండా ఉంటుంది. దీంతో అలసట, ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతున్నాయి. నిద్ర కూడా సరిగా ఉండటం లేదు. ఈ సమస్యల కారణంగా కూడా శరీరంలో హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. వీటి వలన కూడా నీరసం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ సరిగ్గా ఉన్నా కూడా ఇంకా మీరు నీరసంగా, అలసటగా ఉంటున్నారు అంటే.. కొన్ని పోషకాల లోపం ఉన్నట్టే. ఒక మనిషి ఆరోగ్యంగా..

Vitamins Deficiency: ఎప్పుడూ అలసటగానే అనిపిస్తోందా.. ఇదే లోపం కావచ్చు..
Vitamins Deficiency
Follow us on

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో.. ఉరుకుల పరుగుల జీవితంగా మారింది. ఈ జీవితంలో విశ్రాంతి లేకుండా ఉంటుంది. దీంతో అలసట, ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతున్నాయి. నిద్ర కూడా సరిగా ఉండటం లేదు. ఈ సమస్యల కారణంగా కూడా శరీరంలో హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. వీటి వలన కూడా నీరసం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ సరిగ్గా ఉన్నా కూడా ఇంకా మీరు నీరసంగా, అలసటగా ఉంటున్నారు అంటే.. కొన్ని పోషకాల లోపం ఉన్నట్టే. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు కావాలి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు వంటివి అసవరం అవుతాయి. వీటిల్లో ఏవి తగ్గినా.. ఎక్కువైనా ప్రమాదమే. మరి ఎలాంటి పోషకాలు తక్కువ అవడం వలన నీరసం, అలసటగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ బి9:

ఈ విటమిన్ లోపం కారణంగా కూడా అలసట, నీరసం, ఒత్తిడి, నైరాశ్యం వస్తాయి. ఫోలేట్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. ఆకు కూరలు, పండ్లు, తృణ ధాన్యాల్లో ఫోలేట్ ఎక్కువగా లభిస్తుంది.

ఐరన్ లోపం:

శరీరం చక్కగా పని చేయాలంటే ఐరన్ ఖచ్చితంగా అవసరం. హిమోగ్లోబిన్ తయారీలో ఐరన్ ముఖ్యంగా వ్యవమరిస్తుంది. ఐరన్ లోపం ఉంటే ఎనీమియా సమస్య వస్తుంది. రక్తంలోని ఆక్సిజన్ అన్ని అవయవాలకు సరిగ్గా సరఫరా కాదు. దీని వల్ల నీరసం, తల తిరగడం, అలసట వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. కాబట్టి ఐరన్ ఎక్కువగా లభించే.. గుడ్లు, బెల్లం, మాంసం, ఆకు కూరలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

విటమిన్ డి:

విటమిన్ డి లోపించడం వల్ల కూడా నీరసం, అలసట వస్తాయి. కండరాలు కూడా బలహీనంగా తయారవుతాయి. విటమిన్ డి.. సూర్య రశ్మి నుంచి లభిస్తుంది. లేదా ఫ్యాటీ ఫిష్, గుడ్లను ఆహారంగా తీసుకోవాలి

విటమిన్ బి12:

విటమిన్ బి12 తక్కువ అయినా కూడా అలసట తీవ్రంగా ఉంటుంది. తరచూ తలనొప్పిగా ఉంటుంది. ఏకాగ్రత కూడా నశిస్తుంది. విటమిన్ బి12 లభించాలంటే పాలు, గుడ్లు, బీన్స్ వంటివి తీసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..