ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న సీజన్స్‌లో జుట్టు సమస్యలు మరింత పెరుగుతుంటాయి. అలాగే ఇప్పటి తరం అమ్మాయిలు రోజూ జుట్టుకు హెవీ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులను తెగ వినియోగిస్తున్నారు. అలాగే వెంట్రుకలకు కలర్ వేయడం ఎక్కువగా చేస్తున్నారు. దీంతో జుట్టు నాణ్యత తగ్గిపోతుంది. అలాగే.. రకారకాల షాంపూలు.. ఆయిల్స్ వాడడం వలన జుట్టు రాలడం.. పలుచగా మారిపోవడం..డాండ్రఫ్ వంటి సమస్యలు తీవ్రమవుతుంటాయి. అయితే మనం నిత్యం వినియోగించే కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, ఫ్యాటీ యాసిడ్ లక్షణాలున్నాయి. కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలను కలపడం వలన జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే జుట్టు రాలడం వంటి సమస్య తగ్గుతుంది. అవెంటో తెలుసుకుందామా.
* రెండు స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేయాలి. అందులో తేనె మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. దాదాపు అరగంట పాటు అలాగే ఉంచి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనె తేనె కలిపితే జుట్టు మృదువుగా మారడమే కాకుండా మెరుస్తుంది. * జుట్టులో ఎళాస్టిసిటీని మెయింటైన్ చేయడంలో అరటిపండు ఉపయోగపడుతుంది. అరటి పండును కొబ్బరి నూనెలో కలిపి హెయిర్ ప్యాక్ లాగా జుట్టుకు రాసుకుంటే జుట్టు నాణ్యత పెరుగుతుంది. అలాగే జుట్టు చిట్లిపోవడం సమస్య తొలగిపోతుంది. ఈ ప్యాక్ ను జుట్టుపై సుమారు 30 నిమిషాల పాటు అప్లై చేసి షాంపూతో జుట్టును శుభ్రం చేయాలి. * నిమ్మకాయలో విటమిన్ సీ తోపాటు యాంటీ ఫంగల్ గుణాలున్నాయి. ఇది స్కాల్ఫ్ ను శుభ్రపరుస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహయపడుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో కాస్త నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. పది నుంచి 20 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. * ఉసిరి, శీకకాయ్ జుట్టు పెరుగుదలకు సహయపడతాయి. ఉసిరి కాయ జుట్టుకు పోషణను అందిస్తుంది. అలాగే శీకకాయ్ జుట్టును బలపరుస్తుంది. కొబ్బరి కాయలో ఉసిరికాయ రసం, శీకకాయ పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలకు పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును షాంపూతో శుభ్రం చేయాలి. వీటితో జుట్టు సమస్యలు తగ్గుతాయి.
Also Read: Health: ఉదర సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి మంచి ఫలితం ఉంటుంది..