Foods live longer: ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే.. ఎక్కువ కాలం బతుకుతారు..

ఈ మధ్య కాలంలో రోగాలతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. ఎలాంటి రోగాలు ఎప్పుడు ఎటాక్ చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందులోనూ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో తినడానికి, పడుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి.. రోగాలు త్వరగా ఎటాక్ చేస్తున్నాయి. ఇలాంటి కాలంలో ఎక్కువ రోజులు..

Foods live longer: ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే.. ఎక్కువ కాలం బతుకుతారు..
Foods For Live Long
Follow us

|

Updated on: Sep 25, 2024 | 3:37 PM

ఈ మధ్య కాలంలో రోగాలతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. ఎలాంటి రోగాలు ఎప్పుడు ఎటాక్ చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందులోనూ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో తినడానికి, పడుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి.. రోగాలు త్వరగా ఎటాక్ చేస్తున్నాయి. ఇలాంటి కాలంలో ఎక్కువ రోజులు బతకాలన్నా కష్టంగానే మారింది. కానీ ఇప్పుడు చెప్పే ఈ సూపర్ ఫుడ్స్‌ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల.. ఖచ్చితంగా ఎక్కువ రోజులు బ్రతుకుతారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాదం:

ప్రతి రోజూ రెండు బాదం పప్పులు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు అందుతాయి. శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ ఈ, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి పోషకాలు లభిస్తాయి.

అల్లం:

అల్లాన్ని కూడా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ కాలం బ్రతికేందుకు అల్లం హెల్ప్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను పటష్టంగా ఉంచుతుంది. ఇన్ ఫెక్షన్లు త్వరగా ఎటాక్ చేయకుండా చూస్తుంది. అల్లాన్ని ఎలా తీసుకున్నా మేలే.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ:

నిమ్మకాయలు కూడా మనకు ఎప్పుడైనా ఎక్కడైనా లభిస్తాయి. ఇందులో విటమిన్ సి అనేది అధికంగా లభిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సి కూడా చాలా ముఖ్యం. వీలైనంత వరకు నిమ్మకాయను మీ ఆహారంలో చేర్చుకోండి.

వెల్లుల్లి:

వెల్లుల్లి కూడా మనకు ఏ సమయంలో అయినా లభిస్తుంది. ఇది నేరుగా తినేందుకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు తినే ఇతర ఆహారాలతో పాటు చేర్చుకుని తింటే చాలా మంచిది. తినేవారు పరగడుపున రెండు రెబ్బలను తినడం వల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.

పుల్లని పండ్లు:

పుల్లగా ఉండే పండ్లను కనీసం రోజుకు ఒకటి అయినా తినేలా చూసుకోండి. సీజనల్‌గా లభ్యమయ్యే పండ్లు తింటే మరింత మంచిది. వీటి వలన ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవే కాకుండా తాజా పండ్లు కూడా తినడం చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..