Water after Food: ఈ ఆహారాలు తిన్న వెంటనే నీళ్లు తాగడం యమ డేంజర్.. ఎందుకంటే?
నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే కొన్నిసార్లు ఇవి జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొంతమందికి ఇది తెలిసి ఉండవచ్చు. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు. అందుకే వారు అవసరమైనప్పుడల్లా నీరు తాగుతుంటారు. కానీ ఇది జీర్ణ సమస్యలను..

మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీరు చాలా అవసరం అయినప్పటికీ , కొన్ని ఆహారాలు తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవును, నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే కొన్నిసార్లు ఇవి జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొంతమందికి ఇది తెలిసి ఉండవచ్చు. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు. అందుకే వారు అవసరమైనప్పుడల్లా నీరు తాగుతుంటారు. కానీ ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మలబద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి తిన్న తర్వాత నీరు తాగే అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. తిన్న తర్వాత నీరు ఎందుకు తాగకూడదు? నీటికి ఆ ఆహారాలకు మధ్య సంబంధం ఏమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
లైఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు బలహీనపడతాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. సరైన జీర్ణక్రియ ఆరోగ్యానికి వరం లాంటిది. సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల ప్రకారం.. భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల పాటు ఏమీ తాగకూడదు. అదనంగా కొన్ని ఆహారాలు తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు తాగకూడదు. అవేంటంటే..
బొప్పాయి
ఈ పండులో 96% నీరే ఉంటుంది. కాబట్టి దీన్ని తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపు రసాలను పలుచన చేస్తుంది. జీర్ణ రసాల సాంద్రతను తగ్గిస్తుంది. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుంది. అందువల్ల బొప్పాయి తిన్న తర్వాత కనీసం 40 నుంచి 50 నిమిషాల వరకు నీరు తాగకూడదు. అలాగే ఇతర పానీయాలు కూడా తీసుకోకూడదు.
అరటిపండు
అరటిపండ్లలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అరటిపండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల అజీర్ణం, ఉబ్బరం వస్తుంది. సాధారణంగా ఈ పండులోని పోషకాలను గ్రహించడానికి కడుపులోని ఎంజైమ్‌లు అవసరం. నీరు తాగడం వల్ల ఈ ఎంజైమ్‌లు బలహీనపడతాయి. కాబట్టి అరటిపండు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు వేచి ఉండి నీరు తాగాలి.
సిట్రస్ పండ్లు
ఈ పుల్లని పండ్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఈ ఆమ్లాలు పలుచన అవుతాయి. pH సమతుల్యతను దెబ్బతీస్తాయి. గ్యాస్ లేదా అజీర్ణానికి కారణమవుతాయి. కాబట్టి నీరు తాగేందుకు సిట్రస్ పండ్లు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలి.
వేరుశనగలు
వేరుశనగలో సాధారణంగా కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల అజీర్ణం లేదా కడుపులో భారమైన భావన కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలలో ఈ సమస్య సర్వసాధారణం. కాబట్టి వేరుశనగలు తిన్న తర్వాత 20 నుండి 30 నిమిషాలు విరామం తీసుకోవాలి.
పాలు
గోరువెచ్చని పాలు తాగిన వెంటనే నీరు తాగడం వల్ల పాలలోని ప్రోటీన్లను గ్రహించడానికి అవసరమైన కడుపు ఆమ్లాలు బలహీనపడతాయి. ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. అంతే కాదు కడుపులో ఆమ్లత్వాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల జీర్ణ సమస్యలను నివారించడానికి, ఆరోగ్యంగా ఉండటానికిపాలు తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత నీళ్లు తాగడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








