Kitchen Hacks: చలి కాలంలో దుప్పట్లు, బెడ్ షీట్స్ దుర్వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి!
వింటర్ సీజన్‌లో ఇంట్లోకి ఎండ ఎక్కువగా తగలదు కాబట్టి.. దుప్పట్లు, పరుపులు దుర్వాసన వస్తూ ఉంటాయి. ఇలా వాసన వస్తూ ఉంటే ఈ చిట్కాలు ట్రై చేయండి..
సాధారణంగా శీతా కాలం వస్తే ఎండ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయి. చలి కాలంలో ఎండ చాలా అవసరం. ఇంట్లోకి కూడా ఎండ వేడి తగలకపోతే అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోకి ఎండ బాగా తగిలేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఎండ చాలా ముఖ్యం. ఇంట్లో ఎంత బాగా వెలుతురు, గాలి వస్తేనే.. దుర్వాసన వంటివి రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే ఎండ తగలకు దుప్పట్లు, బెడ్ షీట్లు వాసన వస్తూ ఉంటాయి. దీంతో మరలా మరలా ఉతకాల్సి వస్తుంది. ఉతిన బట్టలకు కూడా సరైన విధంగా ఎండ తగలకపోతే వాసన వస్తూ ఉంటాయి. కాబట్టి దుప్పట్లు, బెడ్ షీట్లు వాసన రాకుండా ఈ చిట్కాలు ట్రై చేయండి. ఈ వాసన పోవాలంటే ఇప్పుడు తెలుసుకునే వాటిల్లో ఈ చిట్కాలు ఏవి ట్రై చేసినా మంచిదే.
బేకింగ్ సోడా:
దుప్పట్లు, బొంతలు వాసన రాకుండా చేయడంలో బేకింగ్ సోడా చాలా చక్కగా పని చేస్తుంది. దుర్వాసన పోవాలంటే బేకింగ్ సోడా చక్కగా పని చేస్తుంది. దుప్పట్లు, బెడ్ షీట్లపై ఉండే మురికిని పోగొడుతుంది. సాధారణంగా దుప్పట్లు క్లీన్ చేసేటప్పుడు చివరగా బేకింగ్ సోడా వేసి క్లీన్ చేసి, సువాసన వచ్చే లిక్విడ్స్‌లో ముంచాలి. ఆ తర్వాత ఎండలో ఆరేస్తే దుర్వాసన పోతుంది. అలా కుండా కొన్ని ఉతకలేని పరుపు వంటి వాటిపై బేకింగ్ సోడా చల్లి.. ఓ పావు గంట సేపు అలానే ఉంచి.. తడి క్లాత్‌తో తుడిస్తే, మురికి, దుమ్ము, వాసన పోతుంది.
కర్పూరం:
దుర్వాసనను దూరం చేయడంలో కర్పూరం కూడా చక్కగా పని చేస్తుంది. కర్పూరంలో కూడా బేకింగ్ సోడా వేసి.. పరుపు, బొంతలపై వేసి కాసేపు అలానే వదిలేయండి. దీంతో దుర్వాసన, మురికి కూడా పోతుంది. అలా కాకుండా ఉతికే బెడ్ షీట్స్‌లో కర్పూరం పొడి వేసి ఉతికినా చెడు వాసన రాకుండా ఉంటుంది. కర్పూరం వాసన నచ్చని వాళ్లు సువాసన వచ్చే లిక్విడ్స్ ఉపయోగించవచ్చు.
వెనిగర్:
మురికిని దూరం చేయడంలో, దుర్వాసన రాకుండా చేయడంలో వెనిగర్ కూడా చక్కగా పని చేస్తుంది. ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో కొద్దిగా నీరు, కొద్దిగా వైట్ వెనిగర్ వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని దుప్పట్లు, బొంతలపై స్ప్రే చేస్తే.. చెడు వాసన రాదు. ఇదే పద్దతిలో డెటాల్ కూడా ఉపయోగించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..