Rats Relief Tips: ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండకూడదంటే ఇలా చేయండి..

సాధారణంగా ఇంట్లో అనేక కీటకాలు వస్తూ ఉంటాయి. వీటితో పాటు ఎలుకల బెడద కూడా ఉంటుంది. ఇతర కీటకాల కంటే ఎలుకల వల్ల మరింత తలనొప్పి వస్తుంది. బట్టలను, బుక్స్, ఇతర వంట సామాగ్రిని ఇవి పాడు చేస్తూ ఉంటాయి. ఇంట్లోనే కాకుండా కిరాణా షాపులు, స్టోర్స్‌లో కూడా ఎలుకలు ఉంటూ ఉంటాయి. ఇవి చేసే గోల అంతా ఇంతా కాదు. ఎలుకలు అంత ఈజీగా దొరకవు. పాత చిట్కాలకు ఎలుకలు దొరకడం లేదు. వీటితో కాస్త తెలివిగా ప్రవర్తిస్తేనే..

Rats Relief Tips: ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండకూడదంటే ఇలా చేయండి..
Rats Relief Tips
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 22, 2024 | 9:44 PM

సాధారణంగా ఇంట్లో అనేక కీటకాలు వస్తూ ఉంటాయి. వీటితో పాటు ఎలుకల బెడద కూడా ఉంటుంది. ఇతర కీటకాల కంటే ఎలుకల వల్ల మరింత తలనొప్పి వస్తుంది. బట్టలను, బుక్స్, ఇతర వంట సామాగ్రిని ఇవి పాడు చేస్తూ ఉంటాయి. ఇంట్లోనే కాకుండా కిరాణా షాపులు, స్టోర్స్‌లో కూడా ఎలుకలు ఉంటూ ఉంటాయి. ఇవి చేసే గోల అంతా ఇంతా కాదు. ఎలుకలు అంత ఈజీగా దొరకవు. పాత చిట్కాలకు ఎలుకలు దొరకడం లేదు. వీటితో కాస్త తెలివిగా ప్రవర్తిస్తేనే దొరుకుతాయి. ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే.. మళ్లీ అవి మీ ఇంటి వైపుకు రాకుండా ఉంటాయి. మరి ఎలుకలు ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టేందుకు ఉపయోగ పడే చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇంటికి ఉన్న రంధ్రాలు మూయండి:

ఇంట్లో నీళ్లు వెళ్లేందుకు రంధ్రాలు పెడుతూ ఉంటాం. వీటి ద్వారానే ఎలుకలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఎక్కడైనా రంధ్రాలు ఉంటే వెంటనే వాటిని మూసేయండి.

నిమ్మకాయ – మిరియాల స్ప్రే:

నిమ్మకాయ రసంలో మిరియాల పొడి కలిపి ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు, కిటికీలు, ఇంటి గుమ్మం, రంధ్రాలు ఉన్న చోట్ల స్ప్రే చేయండి. ఈ ఘాటు వాసనకు ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లిపోతాయి.

ఇవి కూడా చదవండి

పుదీనా:

పుదీనా నుంచి కూడా ఘాటు వాసన వస్తూ ఉంటుంది. పుదీనాని పేస్టులా చేసి రసం తీసి ఇల్లంతా స్ప్రే చేయండి. ఆ వాసనకు ఎలుకలు రావు. అలాగే చిన్న కాటన్ బాల్స్ తయారు చేసి వాటికి పుదీనా ఆయిల్ అప్లై చేసి మూలల్లో, కిటికీల వద్ద ఉంచండి. ఈ చిట్కాతో ఎలుకల బెడద వదిలించుకోవచ్చు.

బోరిక్ యాసిడ్:

ఏదన్నా పిండిలో బోరిక్ యాసిడ్ కలిపి.. ఎలుకలు తిరిగే ప్లేస్‌లో ఉంచండి. దీని వల్ల ఇవి అటు వైపుకు వెళ్లకుండా ఉంటాయి.

అల్ట్రాసోనిక్ రిపెల్లెంట్స్:

అల్ట్రాసోనిక్ రిపెల్లెంట్స్ అనేది ఎలుకలను ఇబ్బంది పెట్టే ధ్వని తరంగాలు. ఇది ఇంట్లో పెడితే.. వాటి నుంచి వచ్చే ధ్వని తరంగాలకు ఎలుకలు భయపడి బయటకు వెళ్తాయి. ఇలా సింపుల్ చిట్కాలతో ఇంట్లోంచి ఎలుకల బెడదను తగ్గించుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..