కోడిగుడ్డు పెంకుతో.. మనిషి ఎముకలు అతికించవచ్చంట..!

విరిగిన ఎముకలు అతుక్కోవడం అంత ఆషామాషీ విషయం కాదు. అందులో వయసు పైబడిన వారికి మరీ కష్టం. కానీ.. ఎలాంటివారికైనా.. విరిగిన ఎముకలు అతికించవచ్చని అంటున్నారు హైదరాబాద్ ఐఐటీ, జలంధర్ ఎన్‌ఐటీ రీసెర్చ్ స్టూడెంట్స్. అలాగే.. కోడిగుడ్లు తింటే బలమని.. అందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని తెలుసుకానీ.. కోడుగుడ్డు పెంకు కూడా ప్రోటీన్‌ అనే విషయం మనకు తెలీదు కదా..! అవును.. కోడిగుడ్డ పెంకును కూడా మన ఆరోగ్యానికి పనికొస్తుంది.. మరి అందేంటో తెలుసుకుందామా..! ‘గుడ్డు పెంకు’ […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:25 pm, Thu, 15 August 19
కోడిగుడ్డు పెంకుతో.. మనిషి ఎముకలు అతికించవచ్చంట..!

విరిగిన ఎముకలు అతుక్కోవడం అంత ఆషామాషీ విషయం కాదు. అందులో వయసు పైబడిన వారికి మరీ కష్టం. కానీ.. ఎలాంటివారికైనా.. విరిగిన ఎముకలు అతికించవచ్చని అంటున్నారు హైదరాబాద్ ఐఐటీ, జలంధర్ ఎన్‌ఐటీ రీసెర్చ్ స్టూడెంట్స్. అలాగే.. కోడిగుడ్లు తింటే బలమని.. అందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని తెలుసుకానీ.. కోడుగుడ్డు పెంకు కూడా ప్రోటీన్‌ అనే విషయం మనకు తెలీదు కదా..! అవును.. కోడిగుడ్డ పెంకును కూడా మన ఆరోగ్యానికి పనికొస్తుంది.. మరి అందేంటో తెలుసుకుందామా..!

‘గుడ్డు పెంకు’ నుంచి సేకరించిన బీటా-ట్రై కాల్షియం ఫాస్పేట్‌తో ఎముకను సులువుగా అతికించవచ్చని హైదరాబాద్‌ స్టూడెంట్స్ చేసి చూపించారు. ఐఐటీలోని బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న పరిశోధక విద్యార్థి రూపావత్ ఉదయ్ కిరణ్, లెక్చలర్స్ సుభా నారాయణ్ రథ్, భరత్ పి పాణిగ్రాని, జలంధర్ ఎన్‌ఐటీకి చెందిన మహేష్ కుమార్‌లు ఈ పరిశోధనలు నిర్వహించారు. బాల్ మిల్లింగ్ పద్ధతి ద్వారా.. గుడ్డు పెంకు నుంచి బీటా-టీసీపీని సేకరించవచ్చని తెలిపారు. ఈ గుడ్డు పెంకు పౌడర్‌తో త్రీడీ ప్రింటింగ్ ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే తయారుచేయవచ్చని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు రూపావత్ ఉదయ్ కిరణ్.