Coconut Water: కొబ్బరి నీళ్లు వీళ్లకు విషంతో సమానం.. అస్సలు తాగకండి!

కొబ్బరి నీళ్లు ఎంతో ఆరోగ్యకరమైన డ్రింక్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొబ్బరి నీళ్లు అమృతంతో సమానం అని అంటూ ఉంటారు. కొబ్బరి నీళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఎవరైనా సరే కొబ్బరి నీళ్లను తాగవచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి రోజూ పరగడుపున ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఈ నీళ్లతో ఉండే లాభాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కాబట్టి ఈ నీళ్లు తాగిన వెంటనే..

Coconut Water: కొబ్బరి నీళ్లు వీళ్లకు విషంతో సమానం.. అస్సలు తాగకండి!
Coconut Water
Follow us

|

Updated on: Sep 24, 2024 | 1:05 PM

కొబ్బరి నీళ్లు ఎంతో ఆరోగ్యకరమైన డ్రింక్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొబ్బరి నీళ్లు అమృతంతో సమానం అని అంటూ ఉంటారు. కొబ్బరి నీళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఎవరైనా సరే కొబ్బరి నీళ్లను తాగవచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి రోజూ పరగడుపున ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఈ నీళ్లతో ఉండే లాభాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కాబట్టి ఈ నీళ్లు తాగిన వెంటనే తక్షణ శక్తి లభిస్తుంది. కోకోనట్ వాటర్ తాగడం వల్ల మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాయి. హెల్దీ డ్రింక్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. కానీ కొన్ని రకాల సమస్యలతో బాధ పడేవారికి కొబ్బరి నీళ్లు విషంతో సమానమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంత మంది కొబ్బరి నీళ్లను అస్సలు తాగడకూదు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి వాళ్లు ఎవరో ఇప్పుడు చూడండి.

డయాబెటీస్‌తో ఉన్నవారు:

డయాబెటీస్‌తో బాధ పడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండటం మంచిది. ఇది నేచురల్ డ్రింకే అయినప్పటికీ.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల షుగర్ లెవల్స్ అనేవి పెరుగాతాయి. ఎందుకంటే ఈ నీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగిన వెంటనే రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. కేవలం వైద్యుల సలహా మేరకే ఈ నీటిని తాగాలి. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొబ్బరి నీరు తాగకూడదు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు:

మూత్ర పిండాల సమస్యలతో బాధ పడేవారు కూడా కొబ్బరి నీటిని తాగకూడదు. ఎందుకంటే ఇందులో పొటాషియం అనేది ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది మూత్ర పిండాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో కిడ్నీలు మరింత బలహీనంగా పని చేస్తాయి. కాబట్టి మూత్ర పిండాల సమస్య ఉన్నవారు కొబ్బరి నీటికి దూరంగా ఉండటమే మంచిది.

ఇవి కూడా చదవండి

హై బీపీ ఉన్నవారు:

హై బీపీ సమస్యతో బాధ పడేవారు కూడా కొబ్బరి నీటిని తాగకూడదు. షుగర్ పేషెంట్స్ మాత్రమే కాకుండా బీపీ పేషెంట్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నీటిలో సోడియం ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్త పోటును ఇంకా పెంచుతుంది. కాబట్టి వీరు కొబ్బరి నీళ్లు తాగక పోవడమే బెటర్. అదే విధంగా ఆపరేషన్లు చేయించుకున్న వారు, గర్భ ధారణ ధరించిన వారు మూడు నెలలు నిండకుండా కొబ్బరి నీటిని తాగకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..