Clove Water: లవంగాల నీటితో కొత్త జుట్టు పెరగడం పక్కా..
లవంగాలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. లవంగాల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. లవంగాలతో జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. కొత్త జుట్టు రావడంలో లవంగాలు ఎంతో హెల్ప్ చేస్తాయి..
లవంగాలు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లవంగాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంచడంలో లవంగాలు ఎంతో హెల్ప్ చేస్తాయి. అందుకే లవంగాలను ఆహారంలో భాగం చేశారు. లవంగాలతో ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. సాధారణంగా లవంగాలను ఎన్నో రకాల వంటల్లో వాడుతూ ఉంటారు. ఎక్కువగా మసాలాలతో తయారు చేసే వంటల్లో ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకపోతే వంట రుచే రాదు. లవంగాలతో శరీర ఆరోగ్యమే కాకుండా జుట్టు అందాన్ని కాపాడటంలో కూడా ఈ లవంగాలు ఎంతో ఉపయోగపడతాయి. జుట్టు సమస్యలు తగ్గడంతో పాటు కొత్త జుట్టు వచ్చేలా చేయడంలో లవంగాలు సహాయ పడతాయి. ఎందుకంటే లవంగాల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని కపాడతాయి. మరి లవంగాలను జట్టుకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త జుట్టు వస్తుంది:
లవంగాల నీటిని జుట్టుకు రాయడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. విటమిన్లు, మినరల్స్, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి.. మళ్లీ జుట్టు కొత్తగా, ఒత్తుగా పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి.
చుండ్రు తగ్గుతంది:
లవంగాల నీరు తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్యతో బాధ పడేవారు లవంగాల నీటిని తలకు రాయండి. లవంగాలను నీటిలో వేసి ఓ పది నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టి.. ఆ నీటిని తలకు వాడాలి. ఈ నీటిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు.. చుండ్రును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
హెయిర్ ఫాల్ కంట్రోల్:
లవంగాల నీరు జుట్టుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో కూడా ఈ నీరు జుట్టుకు ఉపయోగ పడుతుంది. కుదుళ్లను స్ట్రాంగ్‌గా చేసి జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
తెల్ల జుట్టు మాయం:
తెల్ల జుట్టు సమస్యతో బాధ పడేవారు సైతం లవంగాల నీటిని ఉపయోగించుకోవచ్చు. లవంగాల నీటిని స్కాల్ఫ్‌కు బాగా పట్టించాలి. ఓ అరగంట తర్వాత సాధారణ నీటితో తల కడిగేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తే.. తెల్ల జుట్టు తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..