Child Care Tips: పసి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఒకే మంచంపై పడుకోవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!

Child Care Tips: అమెరికన్ నటి ‘అలిసియా సిల్వర్‌స్టోన్’ తల్లిదండ్రుల విషయంలో తన విభిన్న శైలి కారణంగా ఎప్పుడూ చర్చల్లో నిలుస్తుంటుంది.

Child Care Tips: పసి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఒకే మంచంపై పడుకోవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
Baby Care
Follow us

|

Updated on: Jul 27, 2022 | 7:45 AM

Child Care Tips: అమెరికన్ నటి ‘అలిసియా సిల్వర్‌స్టోన్’ తల్లిదండ్రుల విషయంలో తన విభిన్న శైలి కారణంగా ఎప్పుడూ చర్చల్లో నిలుస్తుంటుంది. అలీసియా ఇటీవల తన 11 ఏళ్ల కొడుకుతో కలిసి నిద్రిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అలీసియా. అయితే, ఈ ప్రకటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అతను స్వతంత్రంగా ఉండటం ఎలా నేర్చుకుంటాడు? మీరు అతనికి సహాయం చేయడం లేదు, పైగా హాని చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్సే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఒకే మంచంపై నిద్రించవద్దా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

వాస్తవానికి ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డను అన్ని విధాలుగా సంరక్షించుకుంటారు. బాగా చూసుకుంటారు. తమ పిల్లలను సురక్షితంగా ఉంచడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి వారితో కలిసి నిద్రిస్తారు. కానీ, కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే ఆ చర్యలే పిల్లలకు హానీ తలపెడతాయి.

సోషల్ మీడియాలో రచ్చ..

కొడుకుతో కలిసి అలీసియా నిద్రించడాన్ని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో, కొంతమంది దృష్టిలో ఇది సాధారణమైనదిగా భావిస్తున్నారు. అలీసియా పోస్టుపై స్పందించిన ఓ నెటిజన్.. ‘ప్రస్తుతం చాలా మంది పిల్లలు సమాజంలో విచ్చలవిడిగా నడుస్తున్నారు. బహుశా తల్లిదండ్రుల నుండి కొంచెం ఎక్కువ ప్రేమ లభించడమే కారణం కావచ్చు’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ నేపథ్యంలో పిల్లలతో కలిసి ఒకే మంచంలో పడుకోవడం సముచితమా అనే ప్రశ్న తలెత్తుతుంది. లేదా తల్లిదండ్రులు తమ పిల్లలతో ఏ వయస్సు వరకు పడుకోవాలి? అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ అంశంపై శిశువైద్యులు, మనస్తత్వవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

శిశువైద్యులు ఏం చెబుతున్నారంటే..

న్యూయార్క్‌కు చెందిన శిశువైద్యుడు డా. రెబెక్కా ఫిస్క్ మాట్లాడుతూ.. ‘తమ పిల్లలతో కలిసి ఒకే మంచంపై నిద్రించడం అనేది వారి వ్యక్తిగత నిర్ణయం అని నేను తల్లిదండ్రులకు ఎప్పుడూ చెబుతాను. అలాగే దీనికి వైద్యపరమైన కారణం, తీర్పు ప్రత్యేకంగా ఏదీ లేదు. అయితే, 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు ఎప్పుడూ నిద్రించకూడదు. ఎందుకంటే ఇది ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ (SIDS) ప్రమాదాన్ని పెంచుతుంది. అదే సమయంలో, ప్రతి ఒక్కరికి వేర్వేరు నిద్ర విధానాలు ఉంటాయి.’ అని ఫిస్క్ చెప్పారు.

‘ఎక్కువ సమయం మీరు, పిల్లలు నిద్రించడానికి ఇబ్బంది పడవచ్చు. మీరు మీ బిడ్డతో పడుకుంటే, రోజంతా వారు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే.. కలిసి నిద్రపోవడంతో పాటు మీకు అనేక ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీ గదిలోనే మరో బెడ్ ఏర్పాటు చేయొచ్చు. శిశువు నిద్రపోయిన తర్వాత అందులో వేయొచ్చు. తద్వారా బిడ్డ మంచం మీద హాయిగా నిద్రపోతుంది. నిద్రలో ఎటువంటి సమస్యనూ ఎదుర్కోదు. కావాలంటే, బిడ్డను పడుకోబెట్టిన తర్వాత మీరు మరొక గదిలో పడుకోవచ్చు’ అని డాక్టర్ తెలిపారు.

పిల్లలు సురక్షితంగా భావిస్తారు..

అదే సమయంలో, పిల్లల మనస్తత్వవేత్త ఎలిజబెత్ మాథిస్ మాట్లాడుతూ.. ‘పిల్లలతో కలిసి ఒకే బెడ్‌ పై పడుకోవడం చాలా మంచిదని కొన్నిసార్లు రుజువైంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ విడివిడిగా ఉన్నప్పుడు. మీరు సురక్షితంగా భావించే వ్యక్తుల చుట్టూ ఉన్నప్పుడు మంచి అనుభూతి చెందుతారు’ అని మాథిస్ తెలిపారు.

ఏ వయస్సులో పిల్లలతో పడుకోవడం మానేయాలి..

పిల్లలతో కలిసి నిద్రపోవడం ఏ సమయంలో ఆపాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. శిశువులో శారీరక మార్పులను గమనించడం ప్రారంభించినప్పుడు, వారితో కలిసి నిద్రించడం మానేయాలి. దీనిని ప్రీ-యుక్తవయస్సు అంటారు. యుక్తవయస్సు లేదా ప్రీ-యుక్తవయస్సు మీ శిశువు శరీరంలో లైంగికంగా పరిపక్వం చెందడం ప్రారంభించే సమయం. ఈ కాలంలో ఆడపిల్లల్లో రొమ్ము పెరగడం, పురుషుల్లో గడ్డం, మీసాలు పెరగడం, ప్రైవేట్ పార్ట్స్ పరిమాణం పెరగడం వంటి శారీరక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ వయస్సులో మీరు వారితో కలిసి నిద్రించడం మానేయాలి’ అని ఫిస్క్ చెప్పారు.

మీ వ్యక్తిగత స్వేచ్ఛపై కూడా ప్రభావం..

మానసిక నిపుణఉలు మాథిస్ కూడా డాక్టర్ ఫిస్క్ అభిప్రాయాన్ని సమర్ధించారు. యుక్తవయస్సులో తల్లిదండ్రులు, పిల్లలు వేరువేరుగా నిద్రించాలి. యుక్తవయస్సు ప్రారంభమయ్యే సగటు వయస్సు బాలికలకు 11 సంవత్సరాలు, అబ్బాయిలకు 12 సంవత్సరాలు. అయితే, 8 నుంచి 13 సంవత్సరాల మధ్య బాలికలకు యుక్తవయస్సు రావడం కూడా సాధారణం. అదే సమయంలో, అబ్బాయిలలో యుక్తవయస్సు 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. దీనిపై మాథిస్ స్పందిస్తూ.. యుక్తవయస్సులో పిల్లల శరీరాలు అనేక మార్పులకు గురవుతాయి. కావున వారికి ప్రైవసీ ఇవ్వాలి. ఇది వారికి సౌకర్యంగా ఉంటుంది. మీరు, మీ పిల్లలు ఒకే బెడ్‌పై పడుకుంటే.. అది మీ ప్రైవసీని కూడా ప్రభావితం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..