Chanakya Neeti: జాగ్రత్త సుమ.. కోపం కొంప ముంచుతుంది .. అలాంటి వారికి చాణుక్యుడు ఏమని సలహా ఇచ్చాడంటే..?

ఆచార్య చాణక్యుడు అన్ని విషయాలను.. తన నీతిశాస్త్రంలో సమగ్రంగా వివరించాడు.. అందుకే చాణుక్యుడి బోధనలు జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు.. ఉన్నత స్థానంలో ఎదిగేందుకు దోహదపడతాయి.

Chanakya Neeti: జాగ్రత్త సుమ.. కోపం కొంప ముంచుతుంది .. అలాంటి వారికి చాణుక్యుడు ఏమని సలహా ఇచ్చాడంటే..?
Chanakya Niti
Follow us

|

Updated on: Nov 18, 2022 | 8:35 AM

ఆచార్య చాణక్యుడు అన్ని విషయాలను.. తన నీతిశాస్త్రంలో సమగ్రంగా వివరించాడు.. అందుకే చాణుక్యుడి బోధనలు జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు.. ఉన్నత స్థానంలో ఎదిగేందుకు దోహదపడతాయి. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణుక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అలాగే కోపానికి సంబంధించిన విషయాన్ని కూడా నీతిశాస్త్రంలో బోధించాడు. కోపం అనేది సహజమైన చర్య.. కానీ, చాలా సార్లు కొంతమంది అనవసరంగా కావాలని కోపం తెచ్చుకుంటారు. దీని వల్ల మన పని చెడిపోవడమే కాకుండా మనుషుల మధ్య సంబంధాలు కూడా దూరమవుతాయి. అందుకే ఆలోచించి మాట్లాడాలని.. ఆచార్య చాణక్యుడు తెలిపాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకోవాలి. చాలా సార్లు మనకు కోపం వచ్చినప్పుడు ఏమి చేయాలో అర్థం కాదు, దాని వల్ల ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి. మితిమీరిన కోపం విషయంలో చాణక్య విధానం.. ఉత్తమ మార్గదర్శకంగా నిరూపిస్తుందని వివరించాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆలోచనాత్మకంగా మాట్లాడండి

ఏ వ్యక్తి అయినా ఆలోచించిన తర్వాతే మాట్లాడాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎప్పుడు, ఏమి, ఎలా మాట్లాడాలో అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.. ఎందుకంటే అప్పుడు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేము. వాక్కుతోనే ఇతరుల మనసులో గౌరవం ఏర్పడుతుందని చాణక్యుడు వెల్లడించాడు. ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు.. జీవితంలో ఇలాంటి కొన్ని పరిస్థితులు చాలా సార్లు వస్తాయని.. అందుకే ఆలోచన అనేది ముఖ్యమని పేర్కొన్నాడు.

మీ స్వరాన్ని నియంత్రించుకోండి..

ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, అతను మాట్లాడే విషపూరితమైన పదం.. అతనికి తెలియదు లేదా అతను ఏమి మాట్లాడుతున్నాడో అర్ధం కాదు. అదే వ్యక్తి కోపం చల్లారిన తర్వాత అతను చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వచ్చినప్పుడు.. అతనికి పూర్తిగా అర్ధమవుతుంది. ఆ తర్వాత అతను పశ్చాత్తాపం చెందడం ప్రారంభిస్తాడు. అందుకే మాట్లాడేటప్పుడు తన మాటను అదుపులో ఉంచుకోవాలని అంటారు. మాట్లాడేటప్పుడు, ఎదుటివారు చెప్పేది వినాలి.. కోపం తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందో కూడా గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

వెంటనే స్పందించవద్దు..

ఆచార్య చాణక్యుడు కూడా ఏదైనా విషయంపై వెంటనే స్పందించకూడదని చెప్పాడు. ఎవరైనా ఏదైనా చెబితే, ముందుగా మనం దాని గురించి ఆలోచించాలి. తక్షణ ప్రతిస్పందన కారణంగా, చాలాసార్లు సరైన పదాలను ఉపయోగించలేం.. ఆ సమయంలో మాటలు దొర్లుతాయి. దీని వల్ల ఎదుటి వ్యక్తి మీపై తప్పుడు ప్రభావం చూపవచ్చు. అందుకే కోపం సమయంలో ఆచితూచి వ్యవహరించాలని.. ఎల్లప్పుడూ ఆలోచనాత్మకంగా మాట్లాడాలని పేర్కొన్నాడు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన