వ్యాధుల కాలం – వానాకాలం

ఎండలతో అల్లాడిపోయిన జనానికి చినుకు పడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎన్నాళ్లకు గుర్తొచ్చావే వాన అంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ ఈ వానలతో వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఈ సీజన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. జలుబు: వర్షంలో తడిస్తే ముందుగా వచ్చేది జలుబు దీంతో జ్వరం,దగ్గు కూడా కామన్‌గానే వచ్చేస్తాయి. జలుబు అంటువ్యాధి కూడా. శరీరంలో తగినంత వ్యాధినిరోధక శక్తి లేకపోవడంతో కొంతమందిలో వర్షంలో తడిసినా తడవకున్నా […]

వ్యాధుల కాలం - వానాకాలం
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 26, 2019 | 4:55 PM

ఎండలతో అల్లాడిపోయిన జనానికి చినుకు పడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎన్నాళ్లకు గుర్తొచ్చావే వాన అంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ ఈ వానలతో వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఈ సీజన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

జలుబు: వర్షంలో తడిస్తే ముందుగా వచ్చేది జలుబు దీంతో జ్వరం,దగ్గు కూడా కామన్‌గానే వచ్చేస్తాయి. జలుబు అంటువ్యాధి కూడా. శరీరంలో తగినంత వ్యాధినిరోధక శక్తి లేకపోవడంతో కొంతమందిలో వర్షంలో తడిసినా తడవకున్నా సరే జలుబు వస్తూనే ఉంటుంది. అది తగ్గడానికి కూడా చాల సమయం కూడా పడుతుంది. అయితే జలుబును పూర్తిగా తగ్గించే మందులు లేవనే విషయాన్ని వైద్యులు కూడా ఒప్పుకుంటారు. కేవలం దాన్నుంచి ఉపశమనం కలిగించే మందులు మాత్రమే ఉన్నాయి. జలుబు సమస్య ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తే మరింత జాగ్రత్త అవసరం.

ఇక ఈ సీజన్‌లో సాధారణంగా జలుబుతోపాటు జ్వరం, మలేరియా, టైఫాయిడ్‌, అతిసార వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.

డయేరియా : ఈ వ్యాధి ముఖ్యంగా కలుషితమైన ఆహారం,నీళ్లు తాగడం వల్ల ప్రబలే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ సీజన్‌లో సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న పధార్ధాలనే తీసుకోవాలి. అలాగే ఈగలు ముసిరే పదార్ధాలను దరిచేరనివ్వకూడదు. ఎప్పుడూ పరిసరాలు పారిశుధ్యలోపం లేకుండా ఉంచుకోవాలి.

మలేరియా : ప్లాస్మోడియం అనే దోమకుట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధి సోకుతుంది. వర్షకాలంలో అపరిశుభ్ర పరిసరాల వల్ల ఈదోమలువిపరీతంగా వ్యా ప్తి చెందుతాయి.దీంతో దోమల వల్లే ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

డెంగ్యూ : వర్షకాలంలోఅతి వేగంగా వ్యాపించే మరో ప్రమాదకరమైన వ్యాది డెంగ్యూ. గతకొన్నేండ్లలో ఈ వ్యాధితో జిల్లాలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఎడిస్‌ ఈజిప్టీ అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. విపరీతమైన జ్వరం ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం, తలనొప్పి, కీళ్లనొప్పులు, శరీరంపై దద్దుర్లు, జలుబు, దగ్గు ఈ వ్యాధి లక్ష ణాలు. జ్వరం వస్తూ, పోతూ ఉంటుంది. సకా లంలో చికిత్స అందకపోతే ఈవ్యాధి ప్రాణాలకే ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. ఇంటి పరిసరాల్లో ఉండే గుంతల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పొడిగా ఉండేలా చూసుకోవాలి.

వర్షాకాలంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే పలు వ్యాధులతో ప్రమాదం పొంచిఉందనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. అదేవిధంగా బయటికి వెళ్లే ముందు వర్షంలో తడవకుండా గొడుగు, టోపీలవంటివి ఎప్పుడు వెంట తీసుకెళ్లడం కూడా అవసరంగానే భావించాలి.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..