జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, ఎదుగులకు ఉపయోగపడే వాటిలో నూనె ఒకటి. మన జుట్టుకు నూనె మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అయితే జుట్టు తీరును బట్టి నూనెను రాస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
టొరెంటోకు చెందిన హెయిర్ స్టైలిష్ట్ జాస్మిన్ మెరిన్స్కై మాట్లాడుతూ.. మన శరీరానికి మాదిరిగానే జుట్టుకు నూనె చాలా అవసరం అని అన్నారు. జట్టుకు నూనెను రాయడం వలన వెంట్రుక అంతర్గతంగా బలంగా ఉండేలా చేస్తుందని, తద్వారా వెంట్రుక మాడు నుంచి ఊడకుండా చేస్తుందని ఆమె అన్నారు.
సాధారణంగా డ్రై హెయిర్, గట్టి మాడు, ఉంగరాల జుట్టు ఉన్న వారికి హెయిర్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుందని మరో సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ టకీషా సర్టివంట్ డ్ర్యూ చెప్పారు. ఆయిల్ పెట్టుకొని మర్దన చేసుకోవడం వలన రక్త ప్రసరణ కూడా బాగా ఉంటుందని, అంతేకాకుండా డెడ్ స్కిన్‌ను రిపేర్ చేస్తుందని ఆమె అన్నారు.
ఇక నూనెను మాములుగా వాడటం కంటే కాస్త గోరు వెచ్చగా చేసి రాసినట్లైతే ఇంకా మంచి ఫలితాన్ని చూడొచ్చని ఆమె అన్నారు. లేదంటే నూనెను పట్టించి కాసేపు దానికి ఆవిరి పట్టుకొని, ఆ తరువాత షాంప్ చేస్తే కూడా జుట్టుకు మంచి ఎదుగుదల ఉంటుదని సర్టివంట్ డ్ర్యూ చెప్పారు. అలాగే మన జుట్టుకు తగ్గట్లుగా షాంపులను, కండీషనర్లు ఉపయోగించాలని ఆమె అన్నారు. పొడి జుట్టు మీదే నూనెను రాయాల్సిన అవసరం లేదని, కాస్త తేమగా ఉన్నప్పుడు కూడా నూనె రాసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కొందరు అలా రాయడానికే ఇష్టపడతారని సర్టివంట్ డ్ర్యూ అన్నారు. అలాగే ఆయిల్ రాసేటప్పుడు మొదట మందంగా ఉన్న చోట మొదలుపెట్టాలని ఆమె చెప్పారు. ఇలా చేయడం వలన జుట్టుకు మంచి ఫలితాలు ఉంటాయని వారు అంటున్నారు.