Beauty Tips: బ్లాక్ హెడ్స్ బాగా ఇబ్బంది పెడుతున్నాయా?.. అయితే ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి..

పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ఆరోగ్యంతో పాటు చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈక్రమంలో ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్ బాగా ఇబ్బంది పెడుతుంటాయి.  చర్మంలో జీవక్రియలు

Beauty Tips: బ్లాక్ హెడ్స్ బాగా ఇబ్బంది పెడుతున్నాయా?.. అయితే ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 22, 2022 | 9:45 AM

పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ఆరోగ్యంతో పాటు చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈక్రమంలో ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్ బాగా ఇబ్బంది పెడుతుంటాయి.  చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా ఉండే సెబాషియస్ గ్రంథి  ఒక రకమైన నూనె పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలిన పదార్థాలు కూడా తోడయ్యి బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ ఏర్పడతాయి.  ఇక  చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. బ్లాక్ హెడ్స్ ను గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని కలిగిస్తాయి. సాధారణంగా  జిడ్డు చర్మం ఉన్నవారు, బ్లాక్ హెడ్స్ తో బాగా ఇబ్బంది పడుతుంటారు. వీటి నివారణ కోసం మార్కెట్లో లభించే  సౌందర్య ఉత్పత్తులకు బదులు ఇంట్లోనే సహజ చిట్కాలు పాటించడం ఉత్తమం.

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్

స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి. మొటిమల వంటి చర్మ సంబంధిత సమస్యలతో పోరాడడంలో ఇదెంతో సహాయపడుతుంది.  అంతే కాదు, స్ట్రాబెర్రీలో యాంటీఆక్సిడెంట్, ఆస్ట్రింజెంట్,  యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.   ఇవి చికాకు,  UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేయాలంటే..   స్ట్రాబెర్రీలు,  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక గిన్నెలో కలపాలి. వాటిని బాగా మిక్స్ చేసి, ఆపై ముఖమంతా అప్లై చేయాలి. సుమారు 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ చాలా వరకు తొలగిపోతాయి. చర్మం కూడా మెరుపును సంతరించుకుంటుంది.

నారింజ ఫేస్ ప్యాక్

చర్మానికి చాలా ముఖ్యమైనదిగా భావించే విటమిన్ సి నారింజలో పుష్కలంగా లభిస్తుంది.  ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.  కాబట్టి  దీన్ని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.   ఇందుకోసం  ఒక టీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్‌లో చిటికెడు కాస్మెటిక్ పసుపు ఒక టీస్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను  5 నుంచి  10 నిమిషాల వరకు ముఖం మీద  అప్లై చేసుకోవాలి  . తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

బొప్పాయి ఫేస్ ప్యాక్

రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు బొప్పాయిలో ఉంటాయి.    వారానికి రెండుసార్లు బొప్పాయి ఫేస్ ప్యాక్ ను ముఖానికి పట్టిస్తే మంచి ఫలితముంటుంది. చర్మంలో నీటి స్థాయులు పెరిగి  ముఖం మిలమిలా మెరుస్తుంది.   బొప్పాయిలోని విటమిన్లు- ఇ,సి, ఎ లు పలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి.  చర్మంలోని మృతకణాలను తొలగించడంలో బాగా తోడ్పడుతాయి.  ఈ ప్యాక్ తయారుచేసుకోవాలంటే  1/4 కప్పు పండిన బొప్పాయి, ఒక టీస్పూన్ తేనె, ఒక  టీస్పూన్ నిమ్మకాయ అవసరం. బొప్పాయి ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని  అందులోకి తేనె, నిమ్మరసం వేసి పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాసుకోవాలి.  15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆతర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Also Read: IND VS SA: రెండో వన్డేలోనూ చతికిలపడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..

Dolo 650: అంద‌రి త‌ల నొప్పిని త‌గ్గించే డోలో 650.. కంపెనీ వారి త‌ల‌రాత‌ను మార్చేసింది.. కాసుల వ‌ర్షం..

Video Viral: న్యాయమూర్తి ఛాంబర్‌లో పాము కలకలం.. సోషల్‌ మీడియాలో వైరల్‌