శీతాకాలం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఉదయాన్నే పొగ మంచు.. ఎటు చూసినా కనిపించే పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రం అన్నీ ఇన్నీ కావు. ఈ సీజన్‌లో ఉండే ముఖ్యమైన సమస్య వాయు కాలుష్యం. పొగ మంచు కారణంగా వాతావరణం కలుషితం ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా చాలా మంది విహార యాత్రలకు వెళ్తూ ఉంటారు. కానీ ఈ సీజన్‌లో బయట ప్రదేశాలకు వెళ్లడం అంత మంచిది కాదు. శీతా కాలంలో ఎక్కువగా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. సాధారణంగా ఎయిర్ పొల్యూషన్ సమస్య అనేది ఏడాది పొడవునా ఉంటుంది. కానీ వింటర్ సీజన్‌లో మాత్రం మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు బటయకు వెళ్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట గాలి ఎక్కువగా పీల్చుకున్నా.. ఊపిరి తిత్తుల సమస్యలు వస్తాయి.
పొగ మంచుతో కూడిన గాలిని పీల్చడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. కాబట్టి ఆస్తమా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకపోవడమ మంచిది. అదే విదంగా ఉబ్బసం, దగ్గు, జలుబు, న్యూమోనియా, లంగ్స్ ఫైబ్రోసిస్, గుండె సంబంధిత వ్యాధులు వంటి వస్తాయి.
ఈ పొగ మంచు కారణంగా అంటు వ్యాధులు కూడా ఎక్కువగా ఎటాక్ చేస్తాయి. పొంగ మంచుకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వకుండా ఉండటమే మంచిది. తలనొప్పి, ఉబ్బసం, కంటి సమస్యలు, నోటి సమస్యలు, గొంతు సమస్యలు, ముక్కు సమస్యలు వంటివి కూడా వస్తాయి.
ఈ శీతాకాలంలో ఎక్కువగా ఆరోగ్యకరమైన వేడి వేడి ఆహారాలు కూడా తీసుకోవాలి. లేదంటే తర్వగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి.. త్వరగా నీరసించిపోతారు. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తినాలి.
వింటర్ సీజన్‌లో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎక్కువగా బయట తిరగక పోవడమే మంచిది. ఇంటి వద్ద ఎండ వచ్చినప్పుడు మాత్రం కాస్త ఎండలో ఉంటే బెటర్. లేదంటో త్వరగా జబ్బుల బారిన పడతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..