సాధారణంగా పని ఒత్తిడి, ఎక్కువ దూరం ప్రయాణం, అధిక వ్యాయామం వంటి కారణాల వల్ల అలసటకు గురవుతాం. అయితే అలసట నుంచి తక్షణ శక్తి కోసం అలాగే రీఫ్రెష్ మెంట్ కోసం ఆ సమయంలో టీ, కాఫీ వంటి వాటిని ఆశ్రయిస్తాం. అయితే వీటిని తాగితే మరింత అలసటకు గురవుతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది మాత్రం నిజం. టీ,కాఫీల్లో ఉండే కెఫిన్ అనే పదార్థం వల్ల మరింత అలసటకు గురవతామని పరిశోధనల్లో తేలింది. అప్పుడప్పుడు అలసట వచ్చినప్పుడు టీ, కాఫీలను తాగవచ్చు కానీ తరచూ అదే సమస్యతో బాధపడితే మాత్రం టీ, కాఫీలను ఆశ్రయించకుండా అసలైన సమస్యపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. సాధారణంగా అలసట అనేది శరీరతత్త్వం బట్టి వస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి, ఐరన్ లోపం వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా అలసటకు గురవుతారు. అలాగే అలసటకు గురైనప్పుడు శక్తి కోసం ఆహారం తీసుకుంటుంటాం. అయితే ఆ సమయంలో టీ, కాఫీ లేదా తీపి ఎక్కువున్న పదార్థాలు తింటే తక్కువ తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి అలసటకు గురైనప్పుడు టీ, కాఫీ వంటి పానియాలు తాగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలసటకు గురవకుండా కొన్ని నియమాలను పేర్కొంటున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
ప్రతిరోజూ ఆహారంలో ప్రోటీన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రోటీన్లు స్టామినా లెవెల్స్ ను పెంచడంలో సాయం చేస్తాయి. అలాగే కండరాల నష్టాన్ని తగ్గిస్తాయి. అథ్లెట్లు, చురుకైన జీవన శైలి ఉన్నవారు సప్లిమెంట్ల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందేలా చూసుకోవడం ఉత్తమం.
సాధారణంగా చలికాలంలో నీటిని తక్కువగా సేవిస్తాం. ఇది హైడ్రేషన్ సమస్యలకు కారణమవుతుంది. నిర్జలీకరణం కూడా ఒక వ్యక్తి మానసిక స్థితి, శక్తి స్థాయి, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యాన్ని మార్చగలదని కనెక్టికట్ విశ్వవిద్యాలయం పరిశోధన కనుగొంది. కాబట్టి ఏకాగ్రత, అలసట మరియు ఆందోళనపై నిర్జలీకరణ ప్రభావం మహిళలపై మరింత తీవ్రంగా ఉంటుంది.
అలసటకు గురవకుండా ఉండడానికి కెఫిన్ ను తక్కువగా చేసుకోవాలి. ముఖ్యంగా టీ, కాఫీ వంటి ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉండాలి. కాఫీ తాత్కాలికంగా మేలు చేసినప్పుటికీ ధీర్ఘకాలికంగా ఆరోగ్యానికి కీడు చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
మద్యపానం ఆరోగ్యానికి హనికరం అనే మాట మనం చాలా సార్లు వినే ఉంటాం. అలసట సమస్య నుంచి బయటపడడానికి కూడా మద్యపానానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం నిద్రలేమి సమస్య, అలాగే తినే సమయాలను, హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తున్నందున మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.