ఆందోళన, ఒత్తిడి రెండూ ఒకటేనా..?

ఆందోళన, ఒత్తిడి రెండూ ఒకటేనా..?

ఆందోళన, ఒత్తిడి ఇవి రెండు ఇంచుమించుగా ఒకే రకమైన పోలికలను కలిగి ఉంటాయి. కానీ.. ఇవి రెండూ చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే మన శరీరాలు కూడా వాటికి భిన్నంగా స్పందిస్తాయని తెలిపారు అంటరాలకు చెందిన ఒక మనస్తత్వ శాస్త్రవేత్త (ఫిజియాలజిస్ట్) అస్మితా శర్మ. ఏది ఆందోళన, ఏది ఒత్తిడి, దేనికి మన శరీరం ఎలా స్పందిస్తుంది అనే వాటిపై కూలంకుషంగా రీసెర్చ్ నిర్వహించారు. ముందుగా మనం ఆందోళన గురించి తెలుసుకుందాం.. వర్క్ విషయంలో, ఇంట్లోని సమస్యల […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:06 PM

ఆందోళన, ఒత్తిడి ఇవి రెండు ఇంచుమించుగా ఒకే రకమైన పోలికలను కలిగి ఉంటాయి. కానీ.. ఇవి రెండూ చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే మన శరీరాలు కూడా వాటికి భిన్నంగా స్పందిస్తాయని తెలిపారు అంటరాలకు చెందిన ఒక మనస్తత్వ శాస్త్రవేత్త (ఫిజియాలజిస్ట్) అస్మితా శర్మ. ఏది ఆందోళన, ఏది ఒత్తిడి, దేనికి మన శరీరం ఎలా స్పందిస్తుంది అనే వాటిపై కూలంకుషంగా రీసెర్చ్ నిర్వహించారు. ముందుగా మనం ఆందోళన గురించి తెలుసుకుందాం..

వర్క్ విషయంలో, ఇంట్లోని సమస్యల వల్లో చాలా మంది ఒత్తిడి గురై ఆత్మహత్యలు చేసుకుంటూంటారు. ఒకవేళ మీరు ఆందోళన లేదా ఒత్తిడికి గురవుతుంటే వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. అసలు ఏ విషయం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది..? దాని నుంచి ఎలా బయటపడాలి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

ఒక ఉదాహరణ చూస్తే.. మామూలుగా.. స్కూల్స్ లలో, కాలేజీస్ లలో, ఉద్యోగాలలో కొత్తవారితో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు కొంచెం తడబాటుగా, ఆతృతగా ఉంటూ ఆందోళనకు లోనవడం చూస్తూనే ఉంటాం. ఈ అలవాటే వారి జీవితాలపై పెను ప్రభావాలను  చూపిస్తూ ఉంటాయి. ఈ సామాజిక ఆందోళనలు, సహజంగా సమాజం పట్ల ఏర్పడిన మొహమాటాలు, లేదా భయం కూడా కారణం కావచ్చు. అలాగే.. చాలా మంది సిగ్గుతో, ముఖ్యంగా కుటుంబాల్లోని సమస్యలు, ప్రేమ విఫలం వంటి అంశాల వల్ల కూడా ఆందోళన చెందుతూంటారు. వీరు ఏదో ఒకటి ఆలోచిస్తూ నలుగురిలో కలవకుండా ఉంటూ ఉంటారు. చాలా సెన్సెటీవ్ గా కూడా ఉంటారు. ఇవి ఆందోళన కలిగించే విషయాలని అస్మితా శర్మ పేర్కొన్నారు.

ఇక ఒత్తిడి గురించి చూస్తే.. ఎప్పుడైనా.. సడన్ గా.. ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు.. చూసినప్పుడు.. గుండె పగిలిపోతున్నట్లు.. ఊపిరి ఆగిపోయినట్లు ఎప్పుడైనా అలాంటి అనుభూతులకు లోనయ్యారా..? ఇలా అనేకమంది సహజంగా ఎదుర్కొనే అనుభవాలలో ఇది కూడా ఒకటి. ఒకవేళ మీరు ఈ పరిస్థితులకు లోనైనట్లు అనిపిస్తే మీరు ఒత్తిడి గురైనట్లే. ఒక్కసారిగా జ్వరం రావడం, కాళ్లు చేతులు వణకడం, చమటలు పట్టడం లాంటి కారణాలు కూడా ఒత్తిడికి గురైనట్లే.

పానిక్ లేదా ఒత్తిడి ఇది ఒక మానసిక సమస్యగా చెప్పబడుతుంది. మెదడులోని అన్ని భాగాలు ఒకేసారి ఒత్తిడికి లోనైనప్పుడు లేదా భయానికి గురైనప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. నిజజీవితంలోని సమస్యలు ఎక్కువగా వీరిని ఒత్తిడికి గురి చేస్తూంటాయి. కొంతమంది చాలా ఈజీగా తీసుకుంటారు. కొంతమంది వీటి గురించే ఆలోచించి ఒత్తిడికి గురై చివరకు ఆత్మహత్యల వరకూ వెళ్తూంటారు. ఇలా ఒత్తిడికి గురి చెందే వారిలో భయం, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. పదే పదే వీటి గురించే ఆలోచిస్తూంటారు. ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడరు. వాళ్ల సమస్యలను ఇతరులతో షేర్ చేసుకోరు. చివరకు పిచ్చివాళ్లైపోతారని డాక్టర్ అస్మిత పేర్కొన్నారు.

ఇక వీటి నుంచి ఎలా బయట పడాలంటే.. సమస్యలు ఏవైనా ఎక్కువగా వాటి గురించే ఆలోచించకూడదు. వీలైనంత వరకూ తేలికగా తీసుకోవాలి. ఇతరుల ముందు చిన్నవారైపోతారని చాలా మంది వాళ్ల సమస్యలను పంచుకోరు. కానీ అలా చేయడం వల్ల కొంత రిలీఫ్ నెస్ పొందుతారనే విషయం గమనించాలి. ఏ విషయంపైనైనా ట్రెస్ ఫీలవుతున్నారని అనిపిస్తే గట్టిగా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవాలి. ఒక నిశ్వబ్దమైన ప్రదేశానికి వెళ్లి, ప్రశాంతంగా నిటారుగా లేదా పడుకుని మీ కళ్లను మూసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ కళ్లమీద ఉంచినట్లైతే చాలా రీలీఫ్ నెస్ పొందుతారని కొంతమంది మానసిక నిపుణులు తెలుపుతున్నారు. అలాగే.. వాకింగ్, జాగింగ్, యోగా, నవ్వడం వంటివి కూడా మన సమస్యలకు తగు పరిష్కారాలు లభిస్తాయి. పదే పదే వాటి గురించి ఆలోచించడం తగ్గించాలి. మన భాగస్వామితో కానీ, మన సన్నిహితులతో కానీ మన సమ్యలను షేర్ చేసుకోవడం ద్వారా తగినంత ఒత్తిడులకు, ఆందోళనలకు చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు ఫిజియాలజిస్ట్ అస్మితా శర్మ.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu