Health: ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీటిని తాగుతున్నారా.? అయితే ఈ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే..

Health: మనిషి జీవితంలో ప్లాస్టిక్‌ ఓ భాగమైపోయింది. దాదాపు అన్ని వస్తువులను ప్లాస్టిక్‌ రీప్లేస్‌ చేసేస్తోంది. మన తాతల రోజుల్లో మంచి నీటిని మట్టి పాత్రల్లో తాగేవారు, మన నాన్నల సమయానికి వచ్చే సరికి స్టీల్‌ పాత్రలు వచ్చాయి, మన సమయానికి...

Health: ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీటిని తాగుతున్నారా.? అయితే ఈ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే..
Life Style
Follow us

|

Updated on: Dec 01, 2021 | 1:20 PM

Health: మనిషి జీవితంలో ప్లాస్టిక్‌ ఓ భాగమైపోయింది. దాదాపు అన్ని వస్తువులను ప్లాస్టిక్‌ రీప్లేస్‌ చేసేస్తోంది. మన తాతల రోజుల్లో మంచి నీటిని మట్టి పాత్రల్లో తాగేవారు, మన నాన్నల సమయానికి వచ్చే సరికి స్టీల్‌ పాత్రలు వచ్చాయి, మన సమయానికి ప్లాస్టిక్స్‌ బాటిల్స్‌ అనివార్యంగా మారాయి. అయితే సౌకర్యం కోసం మనం చేసుకున్న ఈ అలవాటు ఆరోగ్యాన్ని ఎంత తీవ్రంగా దెబ్బ తీస్తుందో మీకు తెలుసా? ప్లాస్టిక్‌ భూతం ఎన్నో రకాల వ్యాధులకు కారణంగా మారుతుందని మనకు తెలిసినా.. తప్పక వాడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ నీటిని తాగడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీటిని తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సూర్య కాంతికి నేరుగా తాకడం వల్ల డియాక్సి్‌న్‌ అనే ఒకరకమైన టాక్సిన్‌ విడుదలువుంది. దీని కారణంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను పెంపొదిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* దీర్ఘకాలంగా ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను ఉపయోగిస్తే బైఫినైల్‌ ఏ అనే కెమికల్‌ విడుదలవుతుంది. దీన్ని వల్ల డయాబెటిస్‌, ఒబేసిటీ, సంతాన సమస్యలు, మనుషుల్లో ప్రవర్తనలో మార్పులు, చిన్నారుల్లో యుక్త వయసులో రుతుస్రావం రావడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీటిని తాగడం వల్ల నిరోధక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వల్ల విడుదలయ్యే కెమికల్స్‌ మానవుల నిరోధ శక్తిని క్షీణింపచేస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

* ప్లాస్లిక్‌లో ఉండే థాలేట్స్‌ అనే రసాయనం కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మగవారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ చేసిన పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం మనిషి జీవిత కాలంలో మొత్తం 44 పౌండ్ల ప్లాస్టిక్ శరీరంలోకి వెళుతుందని తేలింది. ఇక ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలిన వివరాల ప్రకారం.. ప్రతీ ఏటా భారత్‌ 6000 టన్నుల ప్లాస్టిక్ పోగవుతున్నట్లు తేలింది. వీలైనంత వరకు ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ పాత పద్ధతులను పాటిస్తేనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని మరికొందరు సలహాలిస్తున్నారు.

Also Read: PMFBY Scheme: రైతులకు ముఖ్య సూచన.. డిసెంబరు 31లోపు పంట బీమా చేయించుకోండి.. లేకుంటే ఈ ప్రయోజనం పొందలేరు!

Pulwama Encounter: పుల్వామాలో ఎన్​కౌంటర్.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం

డోకిపర్రు మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు.. శ్రీ శ్రీనివాస విశేష కళ్యాణోత్సవం.. లైవ్ వీడియో

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!