Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

ఎల్‌ఐసీ పాలసీ ప్రియులకు షాకింగ్ న్యూస్..

LIC's Jeevan Anand.. and other insurance plans set to be closed from Jan END, ఎల్‌ఐసీ పాలసీ ప్రియులకు షాకింగ్ న్యూస్..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) త్వరలో 23 పాలసీలను నిలిపేస్తోంది. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన పాలసీలనే నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అందులో ప్రజల్లో బాగా ప్రాచూర్యం పొందిన జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్య, జీవన్ లాభ్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ ఎండోమెంట్ ప్లాన్, న్యూ మనీబ్యాక్, అన్మోల్ జీవన్.. ఇలా మొత్తం 23 పాలసీలు నిలిచిపోనున్నాయి. వాస్తవానికి ఈ పాలసీలన్నీ గతేడాది నవంబర్ 30వ తేదీనే నిలిచిపోవాల్సింది. అయితే ఐఆర్‌డీఏఐ గడువు పెంచడంతో.. ఈ జనవరి 31 వరకు ఈ 23 పాలసీలను కొనసాగిస్తోంది. అయితే వీటి స్థానంలో మళ్లీ కొత్త పాలసీలను తీసుకురానుంది. వాటిలో ఇప్పుడు ఉన్న ప్రీమీయిం రేట్ల కంటే ఎక్కువ కట్టాల్సి వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. బోనస్ కూడా తగ్గుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త పాలసీ చేయాలనుకునే వారు.. ఈ వారం రోజుల్లో చేసుకుంటే.. ప్రస్తుతం ఉన్న లాభాలను పొందే అవకాశం ఉంది.

Related Tags