వాహనదారులకు షాక్.. ఆ పని చేస్తే మీ లైసెన్స్ రద్దే!

Racing In Hyderabad: బైక్ రేసింగ్స్.. ఇటీవల కాలంలో యువతకు ఫ్యాషన్ అయిపోయింది. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మితిమీరిన వేగంతో రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతున్నారు. నగరంలో నెక్లెస్‌ రోడ్డు, పీవీ ఎలివెటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ఔటర్‌ రింగురోడ్లపై ఖరీదైన వాహనాలతో రేసింగ్, ఛేజింగ్‌లకు పాల్పడుతూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకప్పుడు ఇవి రాత్రి మాత్రమే చేసేవారు.. అయితే ఇప్పుడు మార్నింగ్, మధ్యాహ్నం కూడా రేసింగ్‌లు చేస్తుండటంతో తెలంగాణ రవాణాశాఖ వారిపై ప్రత్యేక దృష్టి […]

వాహనదారులకు షాక్.. ఆ పని చేస్తే మీ లైసెన్స్ రద్దే!
Follow us

|

Updated on: Feb 04, 2020 | 1:40 PM

Racing In Hyderabad: బైక్ రేసింగ్స్.. ఇటీవల కాలంలో యువతకు ఫ్యాషన్ అయిపోయింది. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మితిమీరిన వేగంతో రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతున్నారు. నగరంలో నెక్లెస్‌ రోడ్డు, పీవీ ఎలివెటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ఔటర్‌ రింగురోడ్లపై ఖరీదైన వాహనాలతో రేసింగ్, ఛేజింగ్‌లకు పాల్పడుతూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఒకప్పుడు ఇవి రాత్రి మాత్రమే చేసేవారు.. అయితే ఇప్పుడు మార్నింగ్, మధ్యాహ్నం కూడా రేసింగ్‌లు చేస్తుండటంతో తెలంగాణ రవాణాశాఖ వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇకపై ఎవరైనా నగరంలో రేసింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా నిన్న(ఆదివారం) పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రెండు ఖరీదైన స్పోర్ట్స్ కార్లు విపరీతమైన వేగంతో రేజింగ్ చేస్తూ దూసుకుపోతుంటే పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.

ఈ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. నగరంలో ఇలాంటి వాహనాలు ఉన్న యజమానులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆ కౌన్సిలింగ్ సెషన్ తర్వాత కూడా మితిమీరిన వేగంతో వాహనాలు నడిపినట్లు తేలితే మాత్రం.. వెంటనే వారి లైసెన్స్‌ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని.. వాహనాలను సైతం సీజ్ చేయాలని సూచించారు.