ఎల్ఐసీ ల్యాప్స్ అయిందా.. నో వర్రీ.. మరో రెండు నెలలు ఉన్నాయిగా..!

Life Insurance Corporation Of India, ఎల్ఐసీ ల్యాప్స్ అయిందా.. నో వర్రీ.. మరో రెండు నెలలు ఉన్నాయిగా..!

ఎల్ఐసీ పాలసీ దారులకు ఆ సంస్థ యాజమాన్యం గుడ్‌న్యూస్ తెలిపింది. ఎల్‌ఐసీ పాలసీ ల్యాప్స్ అయిపోయిన వారు.. ఆ పాలసీని మళ్లీ కొనసాగించేందుకు అవకాశం కల్పించింది. దీని కోసం ప్రత్యేకంగా పాలసీ రివైవల్ కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. కాగా, నిర్ణీత సమయానికి ప్రీమియం చెల్లించకపోతే.. ఎల్‌ఐసీ వారికి మరో 15 రోజులు గడువు ఇస్తుంది. ఈ గడువులోగా కూడా ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. అప్పుడు పాలసీ పూర్తి ప్రయోజనాలను కస్టమర్లు మిస్ అవుతారు. అయితే అలాంటి వారికి పాలసీలను పునరద్దరించుకోవడానికి ఆ సంస్థ ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పనిచేసింది. ఎల్ఐసీ పాలసీ రివైవల్ క్యాంపైన్ రూపంలో పాలసీదారులు వారి పాలసీని మరలా పునరుద్ధరించుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *