ఉగ్రస్థావరం గుట్టురట్టు.. వీడియో చూస్తే షాక్‌ తినాల్సిందే..

జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రస్థావరం గుట్టురట్టయ్యింది. షోపియాన్‌ జిల్లాలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, 44 బెటాలియన్‌ రాష్ట్రీయ రైఫిల్స్‌,178 బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ భద్రతా బలగాలు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్..

ఉగ్రస్థావరం గుట్టురట్టు.. వీడియో చూస్తే షాక్‌ తినాల్సిందే..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 3:41 AM

జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రస్థావరం గుట్టురట్టయ్యింది. షోపియాన్‌ జిల్లాలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, 44 బెటాలియన్‌ రాష్ట్రీయ రైఫిల్స్‌,178 బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ భద్రతా బలగాలు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జిల్లాలోని దచూ జైనీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఉగ్ర స్థావరాన్ని గుర్తించారు. లోనికి వెళ్లి పరిశీలించగా.. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు.. ఇతర వస్తువులను గుర్తించారు. ఇది లష్కరే తోయిబా ఉగ్రవాదులకు సంబంధించిన ఉగ్రస్థావరంగా తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున ఈ ఉగ్రస్థావరం గుట్టురట్టయ్యిందని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండు యూబీజీఎల్ గ్రేనేడ్లు, మూడు చైనీస్ గ్రేనేడ్లు, ఒక ఏకే-47 రైఫిల్‌తో పాటు 20 మ్యాగజన్లు, ఓ రెడీయో సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మందుగుండు సామాగ్రిని కూడా పెద్ద ఎత్తున సీజ్ చేశారు. ఈ ఘటనపై జైనీ పొర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.