లాక్‌డౌన్‌ వేళ.. ఆ భవనంలోకి గృహ ప్రవేశమైన చిరుత కుటుంబం..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అడవిలో ఉంటున్న జంతువులన్నీ.. యథేచ్చగా రోడ్లపైకి.. గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత పులి.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోకి ఎంటరయ్యింది. అంతేకాదు.. ఆ గ్రామంలో ఉన్న పురాతన భవనంలోకి ప్రవేశం కూడా చేసింది. అక్కడే తన మూడు పిల్లల్ని […]

లాక్‌డౌన్‌ వేళ.. ఆ భవనంలోకి గృహ ప్రవేశమైన చిరుత కుటుంబం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 17, 2020 | 3:54 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అడవిలో ఉంటున్న జంతువులన్నీ.. యథేచ్చగా రోడ్లపైకి.. గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత పులి.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోకి ఎంటరయ్యింది. అంతేకాదు.. ఆ గ్రామంలో ఉన్న పురాతన భవనంలోకి ప్రవేశం కూడా చేసింది. అక్కడే తన మూడు పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టి.. వాటి ఆలనా పాలన చూస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సీసీ ఫుటేజీలో రికార్డ్‌ అయిన ఈ చిరుత కుటుంబం గురించి.. ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్‌ కశ్వన్‌ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అధికారి షేర్‌ చేసిన వీడియోలో.. రాత్రి సమయంలో ఆ ఇంట్లోకి వచ్చిన చిరుత.. తన మూడు పిల్లలను నోటితో పట్టుకుని.. ఓ రూంలోకి తీసుకెళ్తూ కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ షేర్స్ చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు సీసీ ఫుటేజీ ద్వారా చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని పర్వీన్ తెలిపారు. కేవలం 21 సెకన్ల నిడివి గల ఈ చిరుత వీడియోను షేర్‌ చేస్తూ.. ‘లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారని.. ఈ క్రమంలో చిరుత పులి కూడా.. షెల్టర్ ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్రంలోని తంటోల్ గ్రామంలోని ఓ పురాతన భవనాన్ని ఎంచుకుని అందులో ఉంటుందంటూ పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వేటకు వెళ్తూ.. రాత్రి సమయంలో మళ్లీ ఈ ఇంట్లోకి ప్రవేశించి తన పిల్లల దగ్గరికి వస్తోందంటూ తెలిపారు. ప్రస్తుతం ఆ మూడు పులి పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని.. ట్వీట్‌లో పేర్కొన్నారు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..