ఘజియాబాద్ నగర వీధుల్లో చిరుతపులి సంచారం.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ద‌ృశ్యాలు.. వైరల్‌గా మారిన 12 సెకన్ల వీడియో..

అడవుల్లో ఉండే వన్యప్రాణులు అడపదడపా నగరాల్లోకి వచ్చి తరచూ హల్‌చల్ చేస్తున్నాయి. అవి వనాలను విడిచిపెట్టి జన జీవనంలోకి ఎందుకు వస్తున్నాయో కారణం తెలియదు. మరోవైపు అటవీ అధికారులు భద్రతా ప్రామాణాలు సరిగా పాటించకపోవడం కూడా ఓ కారణమే అవుతోంది.

  • uppula Raju
  • Publish Date - 2:49 pm, Sun, 29 November 20

అడవుల్లో ఉండే వన్యప్రాణులు అడపదడపా నగరాల్లోకి వచ్చి తరచూ హల్‌చల్ చేస్తున్నాయి. అవి వనాలను విడిచిపెట్టి జన జీవనంలోకి ఎందుకు వస్తున్నాయో కారణం తెలియదు. మరోవైపు అటవీ అధికారులు భద్రతా ప్రామాణాలు సరిగా పాటించకపోవడం కూడా ఓ కారణమే అవుతోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ ప్రాంతంలో పెద్దపులిని చూసినట్లు ఆ ప్రాంత ప్రజలు చెప్పారు. మరోవైపు ఆదిలాబాద్‌లో ఇటీవల ఓ యువకుడిపై దాడి ప్రాణాలు పొట్టన బెట్టుకుంది.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ చిరుతపులి రోడ్లపై సంచరిస్తూ అందరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. చిరుత వీధుల్లో తిరిగినట్లు స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అది చాలా పెద్దగా ఉందని దాడి చేస్తే మాత్రం తప్పించుకోవడం చాలా కష్టమని పలువురు చెబుతున్నారు. చిరుత సంచరించిన ఆ 12 సెకన్ల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. ఘజియాబాద్‌లోని రాజ్ నగర్ ఏరియాలో తిరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఘజియాబాద్ డెవలప్‌మెంట్ అథార్టీ భవన జనరేటర్ రూం దగ్గరకు చిరుత వెళ్లగా జనరేటర్ ఆన్ చెయ్యగానే అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత అది ఓ చెట్టు ఎక్కి అక్కడి నుంచి దిక్కులు చూసింది. కొందరు కర్రలతో హడావుడి చేయగానే దగ్గర్లో ఉన్న ఓ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్ వైపు వెళ్లింది. ఆ తర్వాత చిరుత ఎటు వెళ్లిందో, ఎక్కడ దాక్కుందో కానరాలేదు.