Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

తిరుమలలో చిరుత కలకలం.. మెట్లమార్గంలో దుప్పిని పీక్కుతిని..!

Leopard Kills Deer in Tirumala Steps Way, తిరుమలలో చిరుత కలకలం.. మెట్లమార్గంలో దుప్పిని పీక్కుతిని..!

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలోని 270 మెట్టు వద్ద ఒక దుప్పిని చిరుత చంపి తినింది. మెట్లపై రక్తపు మరకలు చూసిన భక్తులు షాక్‌కి గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే వారు ప్రమాద స్థలానికి చేరుకుని దుప్పిని.. తీసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు. కొంత సమయం మెట్ల మార్గంలో భక్తుల్ని అనుమతించ లేదు. అయితే.. చిరుత సంచరిస్తుందని తెలుసుకున్న భక్తుల్లో తీవ్ర భయాందోళన చెందారు.

కాగా.. కాలినడకన తిరుమల కొండపైకి చేరుకోవాలంటే రెండు మార్గాలుంటాయి. ఒకటి అలిపిరి మార్గం కాగా, రెండోవది శ్రీవారి మెట్టు మార్గం. వీటిల్లో అలిపిరి మార్గం 24 గంటలూ అందుబాటులో ఉండగా.. మెట్ల మార్గం మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ తెరిచి ఉంటుంది. రాత్రి వేళల్లో భక్తులను అక్కడికి అనుమతించారు. రెండు ప్రాంతాలూ ప్రమాదకరమైన అటవీ ప్రాంతాలే. అక్కడక్కడ భక్తులపై ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగాయి.

Leopard Kills Deer in Tirumala Steps Way, తిరుమలలో చిరుత కలకలం.. మెట్లమార్గంలో దుప్పిని పీక్కుతిని..!

Related Tags