రెండు గంటలు… ముప్పుతిప్పలు పెట్టిన చిరుత

నల్గొండ జిల్లాలో ఓ చిరుత పోలుసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ ఉదయం మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని రైతు పొలంలో చిరుత కనిపించింది. పొలం రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచెలో అది చిక్కుకుంది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించటంతో అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. రంగంలోకిదిగిన అధికారులు చిరుతపై వల వేసిన అధికారులు… మత్తు మందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది వారిపై దాడి చేసి తప్పించుకుంది. వలలో చిక్కినట్టే చిక్కుకుని తప్పించుకుపోయిన […]

రెండు గంటలు... ముప్పుతిప్పలు పెట్టిన చిరుత
Follow us

|

Updated on: May 28, 2020 | 1:29 PM

నల్గొండ జిల్లాలో ఓ చిరుత పోలుసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ ఉదయం మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని రైతు పొలంలో చిరుత కనిపించింది. పొలం రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచెలో అది చిక్కుకుంది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించటంతో అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. రంగంలోకిదిగిన అధికారులు చిరుతపై వల వేసిన అధికారులు… మత్తు మందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది వారిపై దాడి చేసి తప్పించుకుంది. వలలో చిక్కినట్టే చిక్కుకుని తప్పించుకుపోయిన చిరుత.. ఫారెస్టు సిబ్బందిపై దాడి చేసి గాయపరిచింది. పులికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అలాగే ఇనుప కంచెలో చిక్కుకోవడంతో చిరుతకు కూడా గాయాలయ్యాయి.

ఆ తర్వాత కొద్దిసేపటికే అటవీ అధికారుల జీప్‌ కింద దూరిన చిరుత.. సృహా కోల్పోయింది. దీంతో అధికారులు చిరుతను బోన్‌లో బంధించారు. రెండు గంటలపాటు పోలీసులను, ఫారెస్ట్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది.