రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెన్షన్ వాతావరణం.. వ్యవసాయ బావిలోంచి తప్పించుకున్న చిరుత.. భయాందోళనలో స్థానికులు..

Leopard Escaping: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో బావిలో పడిన చిరుత తప్పించుకుంది. గ్రామానికి

  • uppula Raju
  • Publish Date - 12:48 pm, Thu, 14 January 21
leopard escaping from a farm well in Rajanna Sirisilla district

Leopard Escaping: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో బావిలో పడిన చిరుత తప్పించుకుంది. గ్రామానికి చెందిన కోరెపు సురేశ్‌ తన వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు ఉదయం వెళ్లగా బావిలో చిరుత కనిపించింది. దీంతో అధికారులకు సమాచారం అందించగా అటవీ శాక అధికారులు వచ్చి గమనించారు. దీంతో చిరుత బావిలోని ఓ బండరాయి కిందకు వెళ్లింది. అధికారులు చిరుతపులిగా నిర్ధారించి హైదరాబాద్‌ రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు.

అయితే రెస్క్యూ టీం రావడం ఆలస్యమవడంతో బావిలోకి నిచ్చెన, తాళ్లను వేసి సీసీ కెమెరాలను బిగించి, బోను ఏర్పాటు చేశారు. రాత్రివేళ చిరుత బయటకు వస్తే పట్టుకోవాలని పథకం వేశారు. ఉదయం సిబ్బంది వచ్చే సరికి బావిలోంచి చిరుత వెళ్లిపోయింది. నీటిలో పడి చిరుత చనిపోయిందా, బావిలోంచి వెళ్లిపోయిందా అని నిర్థరించుకునేందుకు అటవీ సిబ్బంది పొక్లెన్‌ సాయంతో బావిలోకి ఓ వ్యక్తిని దించారు. బావిలో చిరుత కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిందని నిర్థారించుకున్నారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక కాంగారు పడుతున్నారు. వెంటనే అటవీ అధికారులు చిరుతను బంధించి భయాందోళనలు తొలగించాలని కోరుతున్నారు.

Leopard Fear: రాజన్న సిరిసిల్లలో చిరుత పులి కలకలం.. వ్యవసాయ బావిలో పడ్డ చిరుత.. రంగంలోకి అటవీ ధికారులు..

Kerala Elephant: 50 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. బయటకు తీసేందుకు అధికారుల ప్రయత్నాలు