Leopard: చిరుతకెందుకు బడి? విద్యార్థుల్లో అలజడి!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కీరత్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకి చిరుతపులి ప్రవేశించింది. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. పులిని చూసి హడలిపోయిన విద్యార్థులు తరగతి గదుల్లోకి పరుగులుతీసి తలుపులు

Leopard: చిరుతకెందుకు బడి? విద్యార్థుల్లో అలజడి!
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 6:37 PM

Leopard: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కీరత్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకి చిరుతపులి ప్రవేశించింది. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. పులిని చూసి హడలిపోయిన విద్యార్థులు తరగతి గదుల్లోకి పరుగులుతీసి తలుపులు బిగించుకొన్నారు. కాగా, ఆ చిరుత ఓ కుక్కపై దాడి చేసి దానిని ఫిలిభిత్‌ టైగర్‌ రిజర్వ్‌లోని బారాహీ అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకుపోయింది. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు నిధి దివాకర్‌ రావటంతో, విద్యార్థులు ఆమెకు జరిగిన ఘటనను వివరించారు.

కాగా.. ఆమె వెంటనే అటవీ అధికారులకు సమాచారమందించారు. ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ అజ్మీర్ యాదవ్ నేతృత్వంలోని ఫీల్డ్ ఫారెస్ట్ బృందం పాఠశాలను సందర్శించి పులిపంజా గుర్తుల ఫొటోలను తీశారు. ఈ చిరుత సమీపంలోని పొలాల నుంచి పాఠశాలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు. విద్యార్థుల భద్రత కోసం, చిరుత కదలికలను కనిపెట్టేందుకు పాఠశాల వద్ద సాయుధ సిబ్బందిని నియోగించారు. కాగా, చిరుత ఒకట్రెండు రోజుల్లో అడవిలోకి తిరిగి వెళ్లిపోతుందని అధికారులు భావిస్తున్నారు.